iDreamPost
android-app
ios-app

రోహిత్‌ శర్మ టీమిండియాకు దూరంగా ఉండాలి: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

  • Published Nov 02, 2023 | 2:49 PM Updated Updated Nov 02, 2023 | 2:49 PM

ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. జట్టు కూడా అద్భుతంగా ఆడుతోంది. ఇలాంటి టైమ్‌లో రోహిత్‌ శర్మను ఇంటికి పంపాలంటూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. జట్టు కూడా అద్భుతంగా ఆడుతోంది. ఇలాంటి టైమ్‌లో రోహిత్‌ శర్మను ఇంటికి పంపాలంటూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Published Nov 02, 2023 | 2:49 PMUpdated Nov 02, 2023 | 2:49 PM
రోహిత్‌ శర్మ టీమిండియాకు దూరంగా ఉండాలి: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది రోహిత్‌ సేన. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి.. సూపర్‌ ఫామ్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్‌ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ కూడా గెలిస్తే.. ఇక అధికారికంగా రోహిత్‌ సేన సెమీస్‌లోకి అడుగుపెడుతోంది. లంకతో మ్యాచ్‌ తర్వాత కూడా.. టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిస్తే.. అపజయం ఎరుగని జట్టుగా టీమిండియా వరల్డ్‌ కప్‌ సెమీస్‌ ఆడనుంది. అయితే.. ఇలాంటి కీలక సమయంలో రోహిత్‌ శర్మను ఇంటికి పంపాలని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నాసిర్‌ హుస్సేన్‌ ఊహించని వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్‌ శర్మకు ఇప్పుడు రెస్ట్‌ ఇచ్చి ఇంటికి పంపాలని, స్వదేశంలో వరల్డ్‌ కప్‌ ఆడే జట్టుకు ఇదో మంచి అవకాశం అని నాసిర్‌ పేర్కొన్నాడు. వరల్డ్‌ కప్‌ లాంటి సుదీర్ఘ టోర్నీలో ఆటగాళ్లకు రెస్ట్‌ అవసరం అని అన్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో మ్యాచ్‌ను టీమిండియా ముంబైలో ఆడుతుంది కనుక.. రోహిత్‌ శర్మ స్వస్థలం సైతం ముంబై కావడంతో.. అతని లంకతో మ్యాచ్‌లో రెస్ట్‌ ఇవ్వాలని అంటున్నాడు. రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి అతని కుటుంబంతో గడిపే సమయం ఇవ్వాలని కోరాడు. తాను టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా రోహిత్‌ శర్మను ఇంటికి పంపేవాడిని అని తెలిపాడు. జట్టుకు దూరంగా కొంత సమయం గడిపితే.. రోహిత్‌పై ఒత్తిడి తగ్గుతుందని అన్నాడు.

అయితే.. నాసిర్‌ అభిప్రాయంతో భారత క్రికెట్‌ అభిమానులు విభేదిస్తున్నారు. రోహిత్‌ శర్మకు అలాంటి విశ్రాంతి అవసరం లేదని, కప్పు కొట్టేవరకు రోహిత్‌ రెస్ట్‌ తీసుకోడంటూ పేర్కొంటున్నారు. కాగా.. ప్రస్తుతం టీమిండియా సెమీస్‌ చేరకుండా ఎవరూ అడ్డుకోలేరు. అయితే.. రెస్ట్‌ లాంటివి తీసుకుంటే.. జట్టు ఫ్లో దెబ్బతినే అవకాశం ఉందని, స్టార్‌ ఆటగాళ్లు అంతా రెస్ట్‌ లేకుండానే ఆడుతున్నారు. పైగా మ్యాచ్‌ మ్యాచ్‌కు సరిపడా సమయం ఉంటుండటంతో రెస్ట్‌ అవసరం లేదని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అదీ కాక రోహిత్‌ శర్మ సతీమణి రితికా సైతం రోహిత్‌ మేనేజర్‌గా ఉంటూ అతనితోనే ఉంటున్న విషయం తెలిసిందే. మరి రోహిత్‌ కు రెస్ట్‌ ఇవ్వాలని నాసిర్‌ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.