iDreamPost
android-app
ios-app

నేలమట్టం కానున్న న్యూయార్క్ స్టేడియం! 250 కోట్ల ఖర్చు పెట్టినా నో యూజ్!

New York Cricket Stadium May Demolished: న్యూయార్క్ సిటీలోని నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆ స్టేడియాన్ని అసలు ఎందుకు కూల్చేస్తున్నారు?

New York Cricket Stadium May Demolished: న్యూయార్క్ సిటీలోని నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆ స్టేడియాన్ని అసలు ఎందుకు కూల్చేస్తున్నారు?

నేలమట్టం కానున్న న్యూయార్క్ స్టేడియం! 250 కోట్ల ఖర్చు పెట్టినా నో యూజ్!

పొట్టి ప్రపంచ కప్ 2024 జోరుగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా సగం టోర్నమెంట్ ముగిసింది. మ్యాచుల్లో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ మొత్తంలో మ్యాచుల గురించి, విజయాల గురించి పక్కన పెడితే అంతా కూడా ఒకే విషయం గురించి బాగా మాట్లాడుకున్నారు. అదేంటంటే.. నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఈ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఈ న్యూయార్క్ స్టేడియంలోనే లోయస్ట్ టోటర్స్ నమోదు అయ్యాయి. అంతా పిచ్ గురించే మాట్లాడుకున్నారు. అయితే అలాంటి స్టేడియాన్ని నేలమట్టం చేస్తున్నారు అంటున్నారు.

ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో ఎక్కువగా చర్చ జరిగింది ఏదైనా ఉంది అంటే.. అది నస్సావ్ కౌంటీ స్టేడియం గురించే అని చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుందా? బౌలింగ్ కి సహకరిస్తుందా? ఎలాంటి సమయంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అనే విషయాన్ని నిపుణులు కూడా అంచనా వేసే పరిస్థితి కనిపించలేదు. అన్నింటికీ మించి.. ఆ స్టేడియంలో జరిగిన అన్నీ మ్యాచుల్లో అత్యల్ప స్కోరే నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురించి చేసింది. వరల్డ్ బెస్ట్ టీమ్స్ కూడా ఆ స్టేడియంలో కనీసం 150 పరుగులు చేయలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవాలి.

250 కోట్ల ఖర్చు.. 3 నెలల్లో నిర్మాణం:

టీ20 ప్రపంచకప్ అమెరికాలో నిర్వహిస్తున్న అన్న రోజు నుంచి ఈ నస్సావ్ కౌంటీ న్యూయార్క్ స్టేడియం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ స్టేడియాన్ని కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అంతేకాకుండా.. ఈ స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి విషయంలో ఈ స్టేడియం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా నిలిచింది. అయితే మ్యాచులు స్టార్ట్ అయ్యాక మాత్రం నెగిటివ్ గానే ఎక్కువ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

కూల్చివేత:

ప్రస్తుతం న్యూయార్క్ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్త బాగా వైరల్ అవుతోంది. బుధవారం టీమిండియా- అమెరికా జట్ల మధ్య జరిగేదే ఆ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే రూ.250 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన స్టేడియాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ స్టేడియానికి సంబంధించి వచ్చిన నెగిటివిటీనే దానికి కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా పిచ్ లను ఎలాగోలా మార్చుకోవచ్చు. కానీ, అవుట్ ఫీల్డ్ కూడా చాలా మందకొండిగా ఉంది. కాబట్టి స్టేడియం మొత్తాన్ని మార్చడ కష్టం కాబట్టి.. కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో కేవలం టీమిండియా- పాక్ మ్యాచ్ కే రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. కాబట్టి ఎలాంటి నష్టాలు వచ్చే ఛాన్స్ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. న్యూయార్క్ స్టేడియాన్న కూల్చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.