iDreamPost
android-app
ios-app

నసీమ్‌ షా ఓవర్‌ యాక్షన్‌! పాకిస్థాన్‌పై దారుణమైన ట్రోలింగ్‌

  • Published Aug 25, 2023 | 11:00 AM Updated Updated Aug 25, 2023 | 11:00 AM
  • Published Aug 25, 2023 | 11:00 AMUpdated Aug 25, 2023 | 11:00 AM
నసీమ్‌ షా ఓవర్‌ యాక్షన్‌! పాకిస్థాన్‌పై దారుణమైన ట్రోలింగ్‌

మరికొన్ని రోజుల్లో ఆసియా కప్‌ 2023, అది ముగిసిన వెంటనే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కూడా ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆసియా కప్‌ జరగనుండగా.. అక్టోబర్‌ 5 నుంచి భారత్‌ వేదిక వరల్డ్‌ కప్‌ టోర్నీ జరగనుంది. దీంతో వచ్చే రెండు నెలలు క్రికెట్‌ అభిమానులకు పండగే. ఇప్పుడు క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఎదురుచూస్తోంది కూడా ఈ రెండు టోర్నీల గురించి. అయితే.. ఆసియా కప్‌ ఆరంభానికి ముందే పాకిస్థాన్‌ జట్టు వరల్డ్‌ కప్‌ నెగ్గెసిందా అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు సందేహ పడుతున్నారు. పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ గెలిచేసిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అదేంటి ఇంకా టోర్నీ ప్రారంభం కాకుండానే పాక్‌ ఎలా వరల్డ్‌ కప్‌ గెలుస్తుందని ఆశ్చర్యపోతున్నారా? నెటిజన్లుకు ఆ డౌట్‌ రావడానికి ఓ ఫన్నీ రీజన్‌ ఉందిలేండి.

పాకిస్థాన్‌ యువ బౌలర్‌ నసీమ్‌ షా చేసిన ఓవర్‌ యాక్షన్‌.. ఇప్పుడు పాకిస్థాన్‌పై సెటైర్ల వర్షం కురిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ఆసియా కప్‌ 2023కు ముందు శ్రీలంక వేదికగా పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరుగుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా గురువారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ పాక్‌ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ.. 300 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అఫ్ఘాన్‌ ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ 151 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి వన్డేలో 59 పరుగులకే ఆలౌట్‌ అయిన ఆఫ్ఘనిస్థాన్‌.. రెండో మ్యాచ్‌లో 300 పరుగులు చేయడం విశేషంగా నిలిచింది.

301 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. తడబడుతూనే లక్ష్యం వైపు సాగింది. అయితే.. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిన దశలో అఫ్ఘాన్‌ బౌలర్‌ షారుఖీ.. పాక్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ను మన్కడింగ్‌తో రనౌట్‌ చేశాడు. స్ట్రైక్‌లో ఉన్న పాక్‌ బౌలర్‌ నసీమ్‌ షా.. ఐదో బంతికి ఫోర్‌ బాదాడు. దాంతో పాక్‌ విజయం సాధించింది. అయితే.. టీమిండియా, ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్‌పై వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సెంచరీ చేసి జట్టు ఒంటిచేత్తో గెలిపించినట్లు నసీమ్‌ షా ఫీలైపోయాడు. బ్యాట్‌, హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. పరుగుతీశాడు. ఈ ఓవర్‌ యాక్షన్‌ సెలబ్రేషన్స్‌పై సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతుంది. ఆఫ్ఘనిస్థాన్‌పై ఓ వన్డే మ్యాచ్‌లో గెలిచి, వరల్డ్‌ కప్‌ సాధించిన రేంజ్‌లో ఫీలైపోతున్నారంటూ నెటిజన్లు పాక్‌ను ఏకిపారేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మరోసారి ధోనిపై గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు..