Somesekhar
ఓ టీమిండియా బ్యాటర్ ను ఔట్ చేసినందుకు తన భార్యను వేధించారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా బౌలర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ టీమిండియా బ్యాటర్ ను ఔట్ చేసినందుకు తన భార్యను వేధించారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా బౌలర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది టీమిండియా. ఈ పర్యటనలో భాగంగా 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ లు ముగిశాయి. టీ20 సిరీస్ ను 1-1తో ఇరుజట్లు సమం చేసుకోగా.. వన్డే సిరీస్ ను 2-1తో గెలుచుకుంది టీమిండియా. ఇక అదే జోరును టెస్ట్ సిరీస్ లోనూ చూపించాలని భావించిన భారత్ కు గట్టి షాక్ ఇచ్చారు ప్రోటీస్ బౌలర్లు. సెంచూరియన్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ లో తొలిరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 208 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో కేఎల్ రాహుల్ ఒక్కడే రాణించాడు. ఇదిలా ఉండగా.. ఓ టీమిండియా బ్యాటర్ ను ఔట్ చేసినందుకు తన భార్యను వేధించారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా బౌలర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ టీమిండియా స్టార్ బ్యాటర్ ను ఔట్ చేసినందుకు తన భార్యను సోషల్ మీడియా వేదికగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు సౌతాఫ్రికా స్పిన్నర్ తంబ్రైజ్ షంషీ. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను ఔట్ చేసిన తర్వాత తనను, తన భార్యను సోషల్ మీడియా వేదికగా వేధించారని చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ ను స్పిన్నర్ షంషీ ఔట్ చేశాడు. అతడిని ఔట్ చేసిన అనంతరం ‘షూ కాల్’ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 18 రన్స్ ఇచ్చి సూర్య వికెట్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
“సూర్యను ఔట్ చేసిన తర్వాత నేను చేసుకున్న షూ కాల్ సెలబ్రేషన్స్ ను కొందరు నెగటివ్ గా తీసుకున్నారు. దీంతో నన్ను, నా భార్యను వేధించారు. దీన్ని నేను ఎప్పటికీ సహించలేను. ఆటగాళ్ల జోలికి వస్తే తట్టుకోవచ్చు. కానీ.. ఫ్యామిలీ జోలికి రావడం దారుణం, అది నీచమైంది. ఇలా చేయెుద్దని ప్లేయర్లు తమ ఫ్యాన్స్ కు చెప్పాలి. కొన్నిసార్లు మీ జట్టు విజయం సాధించకపోవచ్చు.. అయితే మీరు జంతువుల్లా కాదు.. మనుషుల్లా ప్రవర్తించాలి” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా షూ కాల్ సెలబ్రేషన్స్ వల్ల పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అలా చేశానని, ప్లేయర్ ను అగౌరవపరచాడనికి కాదని షంషీ తెలిపాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“It was probably the worst…there was also abuse hurled at my wife.”#TabraizShamsi speaks on being abused online for his celebration of #SuryakumarYadav‘s wicket in the T20 series: https://t.co/SJ2hbFBcPS
— Express Sports (@IExpressSports) December 26, 2023