SNP
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎలాంటి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ తర్వాత ఇండియన్ క్రికెట్‌కు అతనే సచిన్. ప్రపంచ క్రికెట్‌లో అతనో కింగ్. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో అపురూప విజయాలు అందించిన రన్ మెషీన్. ప్రపంచ మేటి బౌలర్లకు కోహ్లీ ఓ సింహ స్వప్నం. కోహ్లీ అవుటైతే చాలు మ్యాచ్ గెలిచినట్టే అని భావించే ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ లాంటి గట్టి జట్లకు కోహ్లీ అంటే భయం. అలాంటి ఆటగాడు కాబట్టే అతన్ని అవుట్ చేయడం చాలా మంది బౌలర్లకు ఓ జీవిత కాలపు తీరని కల.
కోహ్లీని అవుట్ చేయడం ఒక డ్రీమ్‌గా పెట్టుకున్న బౌలర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. కానీ, అహంతో తమ కోరికను వెల్లడించరు. కానీ, పాకిస్థాన్ లాంటి శత్రు దేశ ఆటగాడు కోహ్లీ వికెట్ తీసుకోవడమే తన డ్రీమ్ అని బహిరంగంగా వెల్లడించడం నిజంగా ఆసక్తికర విషయం. పైగా ఆ మాట చెప్పింది ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అల్లాటప్పా బౌలర్ కాదు.. పాకిస్థాన్ పేస్ ఎటాక్‌లో కీలక బౌలర్ హరిస్ రౌఫ్.
అయితే.. టీ20 వరల్డ్ కప్ 2022 సందర్భంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించి.. తన బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టి.. ఓటమి అంచున ఉన్న టీమిండియాను గెలిచిపించిన మ్యాచ్ గురించి రౌఫ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశాడు. ఆ మ్యాచ్‌లో నిజానికి పాకిస్థాన్ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. కోహ్లీ అసాధారణ బ్యాటింగ్‌తో తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని, కోహ్లీ వికెట్ తీసుకోవడమే తన డ్రీమ్ అని పేర్కొన్నాడు. రాబోయే ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023లో రౌఫ్ కల నెరవేరుతుందో లేదో చూడాలి. మరి రౌఫ్ స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.