iDreamPost

IND vs BAN: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. ఆ ఒక్కడితోనే ఇండియాకు డేంజర్‌!

  • Published Jun 22, 2024 | 11:59 AMUpdated Jun 22, 2024 | 11:59 AM

Mustafizur Rahman, IND vs BAN, T20 World Cup 2024: బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం టీమిండియా రెడీగా ఉంది. కానీ, ఆ ఒక్కడి విషయంలో మాత్రమే టీమిండియా కాస్త కంగారు పడుతుంది. మరి బంగ్లా టీమ్‌లో ఉన్న డేంజర్‌ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Mustafizur Rahman, IND vs BAN, T20 World Cup 2024: బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం టీమిండియా రెడీగా ఉంది. కానీ, ఆ ఒక్కడి విషయంలో మాత్రమే టీమిండియా కాస్త కంగారు పడుతుంది. మరి బంగ్లా టీమ్‌లో ఉన్న డేంజర్‌ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 22, 2024 | 11:59 AMUpdated Jun 22, 2024 | 11:59 AM
IND vs BAN: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. ఆ ఒక్కడితోనే ఇండియాకు డేంజర్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా నేడు(శనివారం) బంగ్లాదేశ్‌తో సూపర్‌ 8 మ్యాచ్‌ ఆడనుంది. ఆంటిగ్వాలోని సర్ వీవీయన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే టీమిండియా ఆల్‌మోస్ట్‌ సెమీ ఫైనల్‌కు వెళ్లినట్లే. ఇలాంటి కీలక మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలని టీమిండియా భావిస్తోంది. ఏ టీమ్‌ను కూడా లైట్‌ తీసుకోకుండా పూర్తి బలంలో కొట్టాలని రోహిత్‌ సేన భావిస్తోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమ్‌తోనే బంగ్లాదేశ్‌తో కూడా ఆడాలని రోహిత్‌ శర్మ నిర్ణయించినట్లు సమాచారం.

అయితే.. బంగ్లాదేశ్‌ పేరుకి చిన్న టీమ్‌ కానీ, తమదైన రోజున పెద్ద పెద్ద టీమ్స్‌ను కూడా మట్టి కరిపించగలదు. పైగా వెస్టిండీస్‌లోని పిచ్‌లు ఎప్పుడు ఎలా బిహేవ్‌ చేస్తున్నాయో కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉన్న ఈ ప్లేయర్‌ టీమిండియాకు డేంజర్‌గా మారోచ్చు. ఆ ప్లేయర్‌ ఎవరో కాదు.. ముస్తఫీజుర్‌ రెహమాన్‌. ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ వల్ల టీమిండియాకు ముప్పు పొంచి ఉందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ అతని వల్ల టీమిండియా ఎలాంటి ముప్పు పొంచి ఉందంటే..

టీమిండియాకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రెండు కళ్లలాంటి వాళ్లు. వాళ్లిద్దరిలో ఏ ఒక్కరు నిలబడినా.. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించగలరు. కానీ, ఇద్దరికి కామన్‌గా ఉన్న వీక్‌నెస్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌. తాజాగా ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఫారూఖీ బౌలింగ్‌లోనే అవుట్‌ అయ్యాడు. పైగా ముస్తఫీజర్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో శ్రీలంకపై 4 ఓవర్లలో 17 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే సౌతాఫ్రికా 4 ఓవర్లలో 18 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. నెదర్లాండ్స్‌పై 4 ఓవర్లలో 12 రన్స్‌ ఇచ్చాడు, నేపాల్‌పై అయితే.. 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సూపర్‌ 8లో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే కాస్త ఎక్స్‌పెన్సీవ్‌గా ప్రూవ్‌ అయ్యాడు. ఈ ఒక్క బౌలర్‌ను రోహిత్‌, కోహ్లీ ట్యాకిల్‌ చేస్తే.. టీమిండియాకు ఇక తిరుగుండదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి