SNP
మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో బ్యాటర్ కొట్టిన బాల్ నేరుగా తలకొచ్చి తాకడంతో స్టార్ బౌలర్ తలకు తీవ్ర గాయమైంది. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో బ్యాటర్ కొట్టిన బాల్ నేరుగా తలకొచ్చి తాకడంతో స్టార్ బౌలర్ తలకు తీవ్ర గాయమైంది. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
క్రికెట్ మోస్ట్ డేంజరస్ గేమ్. ఆటగాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని గాయాలపాలవుతుంటారు. మరికొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం తెచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. ఇప్పటికే తలకు బాల్ తగిలి.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్ మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే ఉలిక్కిపడింది. తాజాగా ఓ స్టార్ క్రికెటర్‌కు సైతం తలకు బాల్ చాలా బలంగా తాకింది. దీంతో.. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘనట గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో బీపీఎల్(బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) 2024 సీజన్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ కొమిల్లా విక్టోరియన్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టు ట్రైనింగ్ సెషన్‌లో ముస్తఫిజుర్ తలపై బలమైన గాయం తగిలింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రాక్టీస్‌లో భాగంగా పక్కనే ఉన్న నెట్‌లో బ్యాటింగ్ చేస్తున్న లిట్టన్ దాస్ కొట్టిన బాల్.. నేరుగా వచ్చి.. బౌలింగ్ వేసేందుకు వెళ్తున్న ముస్తిఫిజుర్ తలకు తగిలింది. దీంతో అతను తలపట్టుకని ఒంగిపోయాడు. తల నుంచి బాగా రక్తం పోతుండటంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో స్కాన్‌లు తీసిన తర్వాత.. ప్రాణాలకు ప్రమాదం ఏం లేదని వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఫిజియో జహిదుల్ ఇస్లాం ముస్తఫిజుర్ ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సిటీ స్కాన్ తర్వాత అతనికి తల పై భాగంలో మాత్రమే గాయం అయింది. ఇంట్రా-క్రానియల్ బ్లీడింగ్ లేదు. దీంతో.. తలపై కొన్ని కుట్లు పడ్డాయి. ముస్తఫిజుర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు’ అని ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mustafizur Rahman has been taken to the hospital after sustaining a nasty blow to his head during Comilla Victorians’ training session.
(via @BDCricTime)pic.twitter.com/ZIa3lh7wbf
— CricTracker (@Cricketracker) February 18, 2024