iDreamPost
android-app
ios-app

బంగ్లా బ్యాటర్ కామెడీ అవుట్! మీకే సాధ్యం రా బాబు!

  • Published Sep 26, 2023 | 5:29 PM Updated Updated Sep 26, 2023 | 7:29 PM
  • Published Sep 26, 2023 | 5:29 PMUpdated Sep 26, 2023 | 7:29 PM
బంగ్లా బ్యాటర్ కామెడీ అవుట్! మీకే సాధ్యం రా బాబు!

క్రికెట్‌లో నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో పాటు.. కొన్ని సార్లు ఫన్నీ థింగ్స్‌ కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కూడా అలాంటి ఓ నవ్వు తెప్పించే సంఘటనే చోటు చేసుకుంది. బంగ్లా బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ చేసిన ఫన్నీ విన్యాసంతో సోషల్‌ మీడియాలో ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ లూకీ ఫెర్గుసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ తొలి బంతిని రహీమ్‌.. డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకున్న బంతి వికెట్ల ముందు బౌన్స్‌ అయి.. వికెట్లపై పడబోయింది. దాన్ని గమనించిన రహీమ్‌.. అవుట్‌ అవుతాననే కంగారులో బంతిని కాలితో తన్నబోయాడు.

ఫుట్‌ బాల్‌ ఆడినట్లు.. బాల్‌ను తన్నబోయాడు కానీ మిస్‌ అయింది. బాల్‌ మాత్రం వికెట్లపై పడింది. అయితే.. వీడియోలో చూస్తే.. ముష్ఫికర్‌ రహీమ్‌ కాలితో వికెట్లను కొట్టినట్లు కనిపిస్తుంది. ఈ విచిత్రమైన అవుట్‌తో షాక్‌ అయిన రహీమ్‌ కాసేపు అలాగే వికెట్లకేసి చూసి.. చేసేదేం లేక.. పెవిలియన్‌ బాటపట్టాడు. రహీమ్‌ చేసిన దాంట్లో తప్పేమీ లేకపోయినా.. అవుట్‌ కాకుండా అతను చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించేలా ఉంది. ఎంత ప్రయత్నించినా చివరికి ఫన్నీ వేలో అతను అవుట్‌ అయ్యాడు. అయితే.. ఇలాంటి విన్యాసాలు బంగ్లాదేశ్‌ క్రికెటర్లకే సాధ్యం అవుతాయంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్‌ అయింది. కివీస్‌ బౌలర్‌ ఆడమ్‌ మిల్నే నాలుగు వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌ తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. మిల్నేతో పాటు ట్రెంట్‌ బౌల్ట్‌, కోలె చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. ఇక బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో 76 పరుగులతో టాస్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో బంగ్లాకు పెద్దగా స్కోర్‌ రాలేదు. ఇక ఈ మ్యాచ్‌లో ఫన్నీగా అవుటైన ముష్పికర్‌ రహీమ్‌ 25 బంతుల్లో 2 సిక్సులతో 18 పరుగులు చేశాడు. మరి రహీమ్‌ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ రోజు పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు! ఓ మృగం వచ్చి మీద పడ్డట్టు..!