iDreamPost
android-app
ios-app

కుల్దీప్​ బౌలింగ్​లో ముషీర్​ ఖాన్ భారీ సిక్స్.. కొడితే రూఫ్ మీద పడింది!

  • Published Sep 06, 2024 | 4:23 PM Updated Updated Sep 06, 2024 | 4:23 PM

Musheer Khan Hits Kuldeep Yadav For A Massive Six: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​కు ఓ కుర్ర బ్యాటర్ చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్​లో భారీ షాట్లు బాదుతూ భయం పుట్టించాడు.

Musheer Khan Hits Kuldeep Yadav For A Massive Six: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​కు ఓ కుర్ర బ్యాటర్ చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్​లో భారీ షాట్లు బాదుతూ భయం పుట్టించాడు.

  • Published Sep 06, 2024 | 4:23 PMUpdated Sep 06, 2024 | 4:23 PM
కుల్దీప్​ బౌలింగ్​లో ముషీర్​ ఖాన్ భారీ సిక్స్.. కొడితే రూఫ్ మీద పడింది!

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​ను చూస్తే అవతలి జట్టు బ్యాటర్లు వణికిపోతారు. బంతిని గింగిరాలు తిప్పుతూ ఎక్కడ తమను పెవిలియన్​కు పంపిస్తాడోనని భయపడతారు. అతడి ఓవర్లలో పరుగులు రాకపోయినా ఫర్వాలేదు.. వికెట్ పడకపోతే అదే పదిలేలుగా భావిస్తారు. అలాంటి కుల్దీప్​ను ఓ కుర్ర బ్యాటర్ భయపెట్టాడు. భారీ షాట్లు బాదుతూ అతడ్ని కుళ్లబొడిచాడు. ఇది దులీప్ ట్రోఫీ-2024లో జరిగింది. భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ కుల్దీప్​ బౌలింగ్​ను చిత్తు చేశాడు. ఇండియా బీ తరఫున బరిలోకి దిగిన ముషీర్.. ఇండియా ఏపై భారీ సెంచరీతో చెలరేగాడు. 373 బంతుల్లో 181 పరుగులు చేశాడు. 16 బౌండరీలు బాదిన ఈ యువ కెరటం.. 5 భారీ సిక్సులు బాదాడు. అయితే ఇతర బౌలర్ల కంటే కుల్దీప్​ను అతడు ఎదుర్కొన్న తీరు అదిరిపోయింది. అతడి బౌలింగ్​లో రూఫ్​ మీదకు కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్​కే స్పెషల్ హైలైట్​గా నిలిచింది.

ఇండియా బీ ఇన్నింగ్స్ 111వ ఓవర్​ వేసేందుకు వచ్చాడు కుల్దీప్. అప్పటికే 18 ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చుకున్న ఈ స్టార్ స్పిన్నర్.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతడి బౌలింగ్​లో క్లాసికల్ షాట్స్​తో భారీగా పరుగులు పిండుకున్న ముషీర్.. ఆ ఓవర్​లోనూ కుల్దీప్​పై అటాకింగ్​కు దిగాడు. నిర్దాక్షిణ్యంగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఫుల్ లెంగ్త్​లో పడిన బంతిని భలేగా పిక్ చేసిన ముషీర్.. ఒక మోకాలి మీద బ్యాలెన్స్ పెట్టి లెగ్ సైడ్ గట్టిగా కొట్టాడు. దెబ్బకు బాల్ వెళ్లి రూఫ్​ మీద పడింది. కొంచెమైతే బంతి స్టేడియానికి అవతల పడేదే. కానీ రూఫ్​ కొస తాకడంతో బంతి తిరిగొచ్చి ఆడియెన్స్ గ్యాలరీలోకి వచ్చి పడింది. ఈ షాట్ చూసి కుల్దీప్​తో పాటు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బిత్తరపోయారు. ముషీర్ టీమ్​మేట్స్ కూడా ఇదేం షాట్ భయ్యా అంటూ షాకయ్యారు.

ఇంటర్నేషనల్ క్రికెట్​లో మహా మహా బ్యాటర్లను కూడా పోయించిన కుల్దీప్.. ముషీర్ దెబ్బకు బిత్తరపోయాడు. ఇదేం బాదుడు అంటూ కాసేపు అలాగే ఉండిపోయాడు. 19 ఏళ్ల కుర్రాడు టీమిండియా బౌలర్​ను కనికరం లేకుండా కొడుతుంటే ఆడియెన్స్ కూడా ఆశ్చర్యంలో అలాగే చూస్తూ ఉండిపోయారు. అయితే అదే ఓవర్​లో మరో బిగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ముషీర్ ఔట్ అయిపోయాడు. టీమ్ స్కోరు పెంచుదామనే ఉద్దేశంలో అతడు హిట్టింగ్ చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కానీ అతడు తన తరహాలో ఆడితే ఔట్ చేయడం ప్రత్యర్థి జట్టుకు సాధ్యమయ్యేది కాదు. 8వ వికెట్​కు సైనీతో కలసి 204 పరుగులు జోడించాడు ముషీర్. ఒకదశలో 94/7తో ఉన్న ఇండియా బీ 321 పరుగులు చేసిందంటే అది అతడి చలవే. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియా ఏ ఇప్పుడు 2 వికెట్లకు 66 పరుగులతో ఉంది. మరి.. కుల్దీప్​ బౌలింగ్​లో ముషీర్ ఖాన్ కొట్టిన సూపర్ సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.