iDreamPost
android-app
ios-app

RCB ప్లేయర్‌ని చెత్తతో పోల్చిన మాజీ క్రికెటర్! RCB యాజమాన్యం స్ట్రాంగ్ కౌంటర్!

  • Published Mar 26, 2024 | 5:37 PM Updated Updated Mar 26, 2024 | 5:37 PM

Yash Dayal, Murali Karthik: పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసిన ఓ బౌలర్‌ను టీమిండియా మాజీ క్రికెటర్‌ చెత్తతో పోల్చాడు. ఆ క్రికెటర్‌ ఎవరు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Yash Dayal, Murali Karthik: పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసిన ఓ బౌలర్‌ను టీమిండియా మాజీ క్రికెటర్‌ చెత్తతో పోల్చాడు. ఆ క్రికెటర్‌ ఎవరు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 26, 2024 | 5:37 PMUpdated Mar 26, 2024 | 5:37 PM
RCB ప్లేయర్‌ని చెత్తతో పోల్చిన మాజీ క్రికెటర్! RCB యాజమాన్యం  స్ట్రాంగ్ కౌంటర్!

ఐపీఎల్‌ 2024 వినోదం అందించడంతో పాటు వివాదాలకూ కేంద్రంగా మారుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ ఆరు మ్యాచ్‌లు ముగిశాయి. సోమవారం ఆర్సీబీ, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా థ్రిల్లింగ్‌గా సాగింది. చివరి ఓవర్‌ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ మురళీ కార్తీక్‌.. ఆర్సీబీ బౌలర్‌ యశ్‌ దయాళ్‌ను చెత్తతో పోల్చాడు. ఓ టీమ్‌లోని చెత్త.. మరో టీమ్‌కు నిధిగా మారాడంటూ.. దయాళ్‌ను ఉద్దేశించి మురళీ కార్తీక్‌ ఈ కామెంట్‌ చేశాడు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది.

మురళీ కార్తీక్‌ చేసిన కామెంట్‌పై నేరుగా ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ స్పందించింది. అవును అతను మా నిధే అంటూ మురళీ కార్తీక్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. అయితే.. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడిన దయాళ్‌.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సులతు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స​ అతన్ని వదిలేస్తే.. వేలంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొనుగోలు చేసింది. కేకేఆర్‌ మ్యాచ్‌తో ఐదు సిక్సులు ఇచ్చిన తర్వాత దయాళ్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది.

అయితే.. ఒక మాజీ క్రికెటర్‌ అయి ఉండి కూడా మురళీ కార్తీక్‌ ఇలా మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. ఒక ఆటగాడు ఏదో ఒక మ్యాచ్‌లో విఫలం అవ్వడం సాధారణంగా జరుగుతున్న విషయమే. టీ20 వరల్డ్‌ కప్‌ 2007లో యువరాజ్‌ సింగ్‌ ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఏకంగా 6 సిక్సులు బాదాడు. ఆ మ్యాచ్‌తో బ్రాడ్‌ పనికిరాకుండా పోయాడు.. ప్రపంచ మేటి బౌలర్‌గా ఎదిగాడు. అలాగే దయాళ్‌ కూడా ఆ మ్యాచ్‌ నుంచి బయటపడి రాణిస్తాడని క్రికెట్‌ అభిమానులు మురళీ కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన దయాళ్‌ కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఇంత మంచి ప్రదర్శన చేసిన బౌలర్‌పై కార్తీక్‌ నోటి దూల కామెంట్స్‌ చేశాడంటూ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.