Nidhan
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
Nidhan
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోమారో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా అందరి చూపులను తన వైపునకు తిప్పుకున్నాడు. రంజీ ట్రోఫీ-2024 ఫైనల్లో బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కూడా ఫెయిలైన సమయంలో బ్యాటింగ్ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు శార్దూల్. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబైని పీకల్లోతు కష్టాల్లో నుంచి గట్టెక్కించి.. గౌరవప్రద స్కోరును అందించాడు. 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను 200 పరుగులు దాటించాడు. శార్దూల్ గనుక లేకపోతే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 69 బంతులు ఎదుర్కొన్న అతడు.. 8 బౌండరీలు, 3 భారీ సిక్సుల సాయంతో 75 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 రన్స్ చేసింది. ఇందులో శార్దూల్ బ్యాట్ నుంచే 75 పరుగులు వచ్చాయి. ఆ టీమ్ ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లవ్లానీ (37) మంచి స్టార్ట్ అందించారు. కానీ హర్ష్ దూబె (3/62), యష్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43) చెలరేగి బౌలింగ్ చేయడంతో బ్యాటర్లు అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ముంబై 170 పరుగులు చేసినా గొప్పే అని అంతా అనుకున్నారు. అప్పుడే క్రీజులోకి వచ్చాడు శార్దూల్.
తుషార్ దేశ్‌పాండే (14) సాయంతో శార్దూల్ ముంబై ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ మధ్యలో బిగ్ షాట్స్ బాదాడు. ఫోర్లు, సిక్సుల ద్వారానే అతడు 50 పరుగులు చేశాడు. అతడు కౌంటర్ అటాక్ చేయకపోయి ఉంటే ముంబై మరింత డిఫెన్స్‌లో పడేది. ఇక, రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విదర్భ ప్రస్తుతం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులతో ఉంది. అథర్వ టైడే (12 నాటౌట్), కరుణ్ నాయర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బ్యాట్‌తో రెచ్చిపోయిన శార్దూల్ బాల్‌తోనూ సత్తా చాటుతున్నాడు. ధృవ్ షోరే (0)ను ఔట్ చేసి మూడో ఓవర్లోనే ముంబైకి బ్రేక్ త్రూ అందించాడు. మరో బ్యాటర్ అమన్ మఖ్కోడే (8)ని ధవళ్ కులకర్ణి ఔట్ చేశాడు. మరి.. రంజీ ఫైనల్లో శార్దూల్ తుఫాన్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బ్రేకింగ్: రాజకీయాల్లోకి క్రికెటర్ యూసుఫ్ పఠాన్! ఆ పార్టీ నుంచి MPగా పోటీ..
A 37 BALL FIFTY BY SHARDUL THAKUR IN THE RANJI FINAL.
– The commentary of Vivek Razdan is too good! 👏 pic.twitter.com/EPLziEzPR2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2024