పాండ్యా పనులతో విసిగిపోయిన ముంబై ఇండియన్స్‌! దెబ్బకి తీసి పారేసింది!

Hardik Pandya, MI vs SRH, IPL 2024: హార్దిక్‌ పాండ్యాకు ఇప్పటికే ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు మరో తలనొప్పిని కొని తెచ్చుకున్నాడు. దీనిపై ముంబై మేనేజ్‌మెంట్‌ కూడా సీరియస్‌ అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, MI vs SRH, IPL 2024: హార్దిక్‌ పాండ్యాకు ఇప్పటికే ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు మరో తలనొప్పిని కొని తెచ్చుకున్నాడు. దీనిపై ముంబై మేనేజ్‌మెంట్‌ కూడా సీరియస్‌ అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా ఎదుర్కొని వ్యతిరేకతను, హేళనను హార్ధిక్‌ పాండ్యా ఎదుర్కొంటున్నాడు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ లాంటి మ్యాచ్లో ఫేలవ ప్రదర్శనతో టీమిండియా ఓటమికి కారణంగా నిలిచినా కూడా ఇంత వ్యతిరేకత వ్యక్తం అయ్యేది కాదేమో. కానీ, ఐపీఎల్‌లో ఒక టీమ్‌ను వదిలేసి.. మరో టీమ్‌కు కెప్టెన్‌గా వచ్చాడనే కోపంతో హార్ధిక్‌ పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా అయ్యేడని పాండ్యాపై రోహిత్‌ శర్మ అభిమానులు పగబట్టేశారు. ఇదే టైమ్‌లో ముంబై వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో అటు ముంబై ఇండియన్స్‌ అభిమానులు కూడా పాండ్యాను తిట్టిపోస్తున్నారు. ఈ తలనొప్పి సరిపోదన్నట్లు.. తాజాగా పాండ్యా మరో తప్పు చేశాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ముంబై బౌలింగ్‌ లైనప్‌ను చీల్చిచెండాడుతూ.. 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. బదులుగా ముంబై ఇండియన్స్‌ కూడా 240 పైచిలుకు పరుగులు చేసినా.. ప్రత్యర్థి టీమ్‌కు రికార్డు స్థాయి స్కోర్‌ సమర్పించుకున్న చెత్త రికార్డుతో పాటు ఓటమిని కూడా మూటగట్టుకుంది. అయితే.. ఈ ఓటమి తర్వాత.. పాండ్యా డ్రెస్సింగ్‌ రూమ్‌లో స్పీచ్‌ ఇచ్చాడు. ఆ స్పీచ్‌ బాగా వైరల్‌ అయింది. కానీ, తాజాగా ఆ స్పీచ్‌ను పాండ్యా కాపీ కొట్టాడంటూ ఓ వీడియో బయటికి వచ్చింది. దీంతో.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ మళ్లీ పాండ్యాపై పడ్డారు. కాపీ పాండ్యా అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఉన్న వ్యతిరేకత సరిపోలేదంటూ.. ఈ కాపీ స్పీచ్‌లతో పాండ్యా పరువుపోగొట్టుకుంటున్నాడని అతన్ని అభిమానించే వారు వాపోతున్నారు. ఈ విషయంపై ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ కూడా సీరియస్‌ అయినట్లు సమాచారం. అందుకు హార్ధిక్‌ పాండ్యా ఇచ్చిన స్పీచ్‌ను అప్పుడు తమ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్లో పోస్ట్‌ చేసిన ముంబై ఇండియన్స్‌, తాజాగా ఆ వీడియోను తొలగించింది. పాండ్యా కాపీ కొట్టి స్పీచ్‌ ఇచ్చాడని భావించిన ముంబై మేనేజ్‌మెంట్‌.. దానిపై మరింత ట్రోలింగ్‌ జరగకముందే దాన్ని తొలగించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments