KKR vs MI: పెద్ద తప్పు చేసి.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణమైన పాండ్యా!

Hardik Pandya, KKR vs MI, IPL 2024: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమికి ఆ జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యానే కారణం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరి పాం‍డ్యా ఎలా ముంబై ఓటమికి కారణం అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, KKR vs MI, IPL 2024: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమికి ఆ జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యానే కారణం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరి పాం‍డ్యా ఎలా ముంబై ఓటమికి కారణం అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చిత్తుగా ఓడి.. ఈ సీజన్‌ నుంచి దాదాపు ఇంటి బాట పట్టింది. శుక్రవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నిజానికి ముంబై ఇండియన్స్‌ ఈజీగా గెలవాల్సింది. కానీ, కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా చేసిన పెద్ద తప్పు ముంబై ఇండియన్స్‌ను మ్యాచ్‌ ఓడిపోయేలా చేసిందని క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా మాట్లాడుతూ.. పాండ్యా చేసిన తప్పిదాల గురించి వివరించాడు. ఇంతకీ పాండ్యా చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇక్కడి నుంచి కేకేఆర్‌ కోలుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇక్కడే హార్దిక్‌ పాండ్యా తన చెత్త కెప్టెన్సీ మార్క్‌ను చూపిస్తూ.. అనవసరంగా నమన్‌ ధీర్‌తో బౌలింగ్‌ వేయించాడు. టీమ్‌లోని ప్రధాన ఐదుగురు బౌలర్లకు మంచి బౌలింగ్‌ పడుతున్నా.. వికెట్లు కూడా వస్తున్నా.. నమన్‌ ధీర్‌తో బౌలింగ్‌ వేయించాడు. అది కూడా మూడు ఓవర్లు. పాండ్యా చేసిన ఈ పొరపాటే.. కేకేఆర్‌కు ప్రాణం పోసింది.

5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కేకేఆర్‌ను వెంకటేశ్‌ అయ్యర్‌, మనీష్‌ పాండ్యా ఆదుకున్నారు. 6 వికెట్‌కు ఏకంగా 83 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి.. కేకేఆర్‌కు 169 పరుగుల పోరాటే టార్గెట్‌ను అందించారు. కనీసం 100 పరుగులైన చేస్తుందా? అని అనుమానం వచ్చిన చోట.. కేకేఆర్‌ ఏకంగా ముంబై ఇండియన్స్‌ ముందు 170 పరుగుల ఫైటింగ్‌ టోటల్‌ను పెట్టింది. అది కూడా 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత. అంత ఒత్తిడిలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లలో ఎటాక్‌ చేయించకుండా.. హార్ధిక్‌ పాండ్యా.. నమన్‌ ధీర్‌తో వరుసగా మూడు ఓవర్లు వేయించడంతో వెంకటేశ్‌ అయ్యర్‌, మనీష్‌ పాండ్యా అతన్ని సులువుగా ఎదుర్కొని.. క్రీజ్‌లో పాతుకుపోయారు. తర్వాత వేగంగా ఆడిన మ్యాచ్‌పై పట్టు సాధించారు. 170 పరుగుల టార్గెట్‌ అయినా.. వాంఖడేలో ఈజీగా ఛేజ్‌ చేయవచ్చు. పైగా డ్యూ కూడా వచ్చింది. అయినా కూడా ముంబై ఇండియన్స్‌ చెత్త బ్యాటింగ్‌తో ఓటమి పాలైంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 19.5 ఓవర్లలో 169 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 70, మనీష్‌ పాండే 42 పరుగులతో అదరగొట్టారు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. కేకేఆర్‌ బ్యాటర్లలో 8 మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ముంబై బౌలర్లలో నమన్‌ తుషారా, జస్ప్రీత్‌ బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టారు. హార్ధిక్‌ పాండ్యా 2, పీయూష్‌ చావ్లా ఒక వికెట్‌ తీసుకున్నారు. ఇక 170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 56, టిమ్‌ డేవిడ్‌ 24 పరుగులతో రాణించినా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు. వీరిద్దరు మినహా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. రోహిత్‌ శర్మ 11, ఇషాన్‌ కిషన్‌​ 13, నమన్‌ ధీర్‌ 11, తిలక్‌ వర్మ 4, హార్ధిక్‌ పాండ్యా 1 ఇలా వరుస బెట్టి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో.. ముంబై ఇండియన్స్‌ సొంత గడ్డపై 24 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మరి ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమికి కెప్టెన్‌గా పాండ్యా తీసుకున్న నిర్ణయమే కారణం అంటూ వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments