Somesekhar
మహేంద్రసింగ్ ధోని త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి ధోని లండన్ ఎందుకు వెళ్తున్నాడు? తెలుసుకుందాం పదండి.
మహేంద్రసింగ్ ధోని త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి ధోని లండన్ ఎందుకు వెళ్తున్నాడు? తెలుసుకుందాం పదండి.
Somesekhar
మహేంద్రసింగ్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ కు మరో టైటిల్ అందించాలన్న కల నెరవేరలేదు. ఈ సీజన్ లో నిలకడగా రాణించిన సీఎస్కే టీమ్.. ప్లే ఆఫ్స్ కు వెళ్లలేకపోయింది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న వివాదంలో ధోనిది తప్పులేదన్న వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ధోని త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. మరి ధోని లండన్ వెళ్లడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహేంద్రసింగ్ ధోని.. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నైని గెలిపించడానికి తన శక్తి మేరకు పోరాడాడు. ఒకవైపు కండరాలు, వెన్ను నొప్పి గాయాలు బాధిస్తున్నప్పటికీ.. ఇంజక్షన్స్ వాడుతూనే మ్యాచ్ ల్లో బరిలోకి దిగాడు. గాయాల కారణంగానే బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి వచ్చాడు. కాళ్లకు బ్యాండేజీలు వేసుకుని మరీ ఆడాడు. అభిమానులను అలరించడానికి ఎంత పెద్ద గాయాన్ని అయినా.. సహించగల సహనం ధోని సొంతం. అందుకే అభిమానులు సైతం ధోని అంటే పడిచస్తారు. ఇదిలా ఉండగా.. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికంటే ముందే ధోనికి మోకాలి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.
అయితే.. ఐపీఎల్ కోసం తన గాయాలు పూర్తిగా మానకముందే మ్యాచ్ లు ఆడాడు మిస్టర్ కూల్. చెన్నై టోర్నీనుంచి నిష్క్రమించడంతో.. ధోనికి కాస్త టైమ్ దొరికింది. దీంతో కండరాల గాయానికి చికిత్స చేయించుకోవడానికి ధోని త్వరలోనే లండన్ వెళ్తున్నట్లు సమాచారం. అక్కడ తన కండరాల గాయానికి ఆధునిక వైద్యం చేయించుకుని మళ్లీ తిరిగొస్తాడు. ధోని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాతనే తన భవిష్యత్ పై క్లారిటీ వస్తుంది అని క్రీడా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.