iDreamPost
android-app
ios-app

SRH vs CSK: ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! ఇది అస్సలు ఊహించి ఉండరు

  • Published Apr 02, 2024 | 5:22 PM Updated Updated Apr 02, 2024 | 5:22 PM

MS Dhoni, CSK vs SRH, IPL 2024: ఐపీఎల్‌లో చాలా మంది ధోని ఆట చూసేందుకే సీఎస్‌కే మ్యాచ్‌లు చూస్తుంటారు. అయితే.. అలాంటి వారికి ఓ బ్యాడ్‌ న్యూస్‌. ఇటీవల ఢిల్లీపై విధ్వంసం సృ‍ష్టించిన ధోని.. గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, CSK vs SRH, IPL 2024: ఐపీఎల్‌లో చాలా మంది ధోని ఆట చూసేందుకే సీఎస్‌కే మ్యాచ్‌లు చూస్తుంటారు. అయితే.. అలాంటి వారికి ఓ బ్యాడ్‌ న్యూస్‌. ఇటీవల ఢిల్లీపై విధ్వంసం సృ‍ష్టించిన ధోని.. గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 02, 2024 | 5:22 PMUpdated Apr 02, 2024 | 5:22 PM
SRH vs CSK: ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! ఇది అస్సలు ఊహించి ఉండరు

ఈ సారి ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ-హార్ధిక్‌ పాండ్యా గొడవే కాకుండా మరో విషయం కూడా హైలెట్‌గా నిలుస్తోంది. అదేంటంటే.. ఈ ఐపీఎల్‌ ధోని కెరీర్‌లో చివరి ఐపీఎల్‌ కావడంతో ధోని ఆడే ప్రతి మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రోహిత్‌-పాండ్యా గొడవ లేకుండా ఉంటే.. ఐపీఎల్‌ 2024 సీజన్‌.. ధోని ట్రెబ్యూట్‌ ఐపీఎల్‌గా మారిపోయి ఉండేది. ఇప్పటికీ కూడా ధోని కోసమే చాలా మంది సీఎస్‌కే మ్యాచ్‌లు చూస్తున్నారు. ధోని తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు రాలేదని చాలా మంది ధోని ఫ్యాన్స్‌ బాగా హర్ట్‌ అయ్యారు. ధోని కోసం స్టేడియానికి వస్తే.. అతను బ్యాటింగ్‌కి రాకుంటే ఎలా అంటూ ఓపెన్‌గా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

కానీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోని తన విశ్వరూపం చూపించాడు. రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగని కసినంతా.. ఢిల్లీ బౌలర్లపై చూపిస్తూ.. కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌ చూసి ధోని ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోయారు. ఇది కదా తమకు కావాల్సింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫుల్‌ హ్యాపీగా ఉన్న వారికి.. తాజాగా ఒక బ్యాడ్‌ న్యూస్‌ అందుతోంది. అదేంటంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఈ శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు ధోని దూరం కానున్నట్లు సమాచారం.

bad news for dhoni fans

ఈ నెల 5న ఉప్పల్‌ వేదికగా సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ధోనికి రెస్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపించిన ధోని.. కాలి పిక్కలు పట్టేయడంతో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ధోనికి ఈ మ్యాచ్‌లో రెస్ట్‌ ఇవ్వాలనే ఆలోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ధోని ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చేసిన విషయం తెలిసిందే. మరి ధోని ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది స్పష్టంగా తెలియాలంటే కొంత టైమ్‌ వేచిచూడాల్సిందే. క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రం ధోని ఆడాలనే కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.