iDreamPost
android-app
ios-app

MS Dhoni: వీడియో: బ్యాడ్మింటన్ కోర్డులో రచ్చ చేసిన ధోని! మాహీలో మరో టాలెంట్!

  • Published Aug 26, 2024 | 3:58 PM Updated Updated Aug 26, 2024 | 3:58 PM

MS Dhoni Spotted On Badminton Court: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్​తో దుమ్మురేపడం కామనే. కానీ బ్యాడ్మింటన్ రాకెట్​తోనూ అతడు చెలరేగిపోయాడు. తన చేతికి ఏదిచ్చినా అది ఆయుధంలాగే పని చేస్తుందని నిరూపించాడు.

MS Dhoni Spotted On Badminton Court: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్​తో దుమ్మురేపడం కామనే. కానీ బ్యాడ్మింటన్ రాకెట్​తోనూ అతడు చెలరేగిపోయాడు. తన చేతికి ఏదిచ్చినా అది ఆయుధంలాగే పని చేస్తుందని నిరూపించాడు.

  • Published Aug 26, 2024 | 3:58 PMUpdated Aug 26, 2024 | 3:58 PM
MS Dhoni: వీడియో: బ్యాడ్మింటన్ కోర్డులో రచ్చ చేసిన ధోని! మాహీలో మరో టాలెంట్!

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మల్టీ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. క్రికెట్ ఫీల్డ్​లోకి దిగితే అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్​తో పాటు కెప్టెన్సీతోనూ ఆకట్టుకుంటాడు మాహీ. గ్రౌండ్ దాటి బయటకు వచ్చాడా బైకులు వేసుకొని షికార్లకు వెళ్లిపోతాడు. తాను వాడే బైకులను అతడే స్వయంగా రిపేర్ చేసుకుంటాడు. ఫామ్​హౌజ్​లో వ్యవసాయం కూడా చేస్తుంటాడు ధోని. ఇలా తనకు నచ్చిన విషయాలను త్వరగా నేర్చుకొని వాటిపై పట్టు సాధించడంలో అతడికి అతడే సాటి. అలాంటోడు తనలోని మరో టాలెంట్​ను బయటకు తీశాడు. ఎప్పుడూ క్రికెట్ బ్యాట్​తో దుమ్మురేపే మాహీ.. ఫర్ ఏ ఛేంజ్ అంటూ బ్యాడ్మింటన్ రాకెట్​ను చేతిలోకి తీసుకున్నాడు. ఇంకేం ఉంది.. ప్రొఫెషనల్ ప్లేయర్లలా ఆడుతూ కోర్టులో రచ్చ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో బ్యాడ్మింటన్ కోర్డులో దుమ్మురేపాడు ధోని. 43 ఏళ్ల మాహీ బ్యాడ్మింటన్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అదిరిపోయే సర్వ్​లు చేస్తూ, పవర్​ఫుల్ స్మాష్​లు కొడుతూ కనిపించాడు. అతడు బ్యాట్మింటన్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోర్టులో అటూ ఇటు పరుగులు తీస్తూ జంప్ చేసి స్మాష్ కొట్టిన తీరును చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఆ వయసులోనూ ఇంత ఫిట్​నెస్ ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. తోపు ప్లేయర్ల మాదిరి అలవోకగా అంత పవర్​ఫుల్ స్మాష్​లు కొట్టడం ఏంటంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇది మాహీకి మాత్రమే సాధ్యమని.. ఇంతలా రెచ్చిపోవడం అతడి వల్లే అవుతుందని మెచ్చుకుంటున్నారు.

ధోని చేతిలో క్రికెట్ బ్యాట్, బ్యాడ్మింటన్ రాకెట్.. ఏది ఉన్నా రిజల్ట్​లో ఛేంజ్ ఉండదని, దుమ్మురేపడం పక్కా అని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. అతడి చేతుల్లోకి వచ్చాక అవి ఆయుధాల్లా మారి గర్జిస్తాయని అంటున్నారు. ఇక, గత ఏడాదిన్నరగా కాలి గాయంతో బాధపడుతున్న మాహీ.. ఆ కారణం వల్లే ఈ ఐపీఎల్ సీజన్​లో ఆఖర్లో బ్యాటింగ్​కు దిగుతూ వచ్చాడు. ఇంజ్యురీ ఎక్కువవుతుందనే భయంతో చివర్లో కొన్ని బంతులు ఆడేందుకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అలాంటిది తాజా బ్యాడ్మింటన్ వీడియోలో మాత్రం ఎగిరెగిరి స్మాష్​లు కొడుతూ కనిపించాడు. అతడ్ని చూస్తే రికవర్ అయి ఫుల్​ ఫిట్​నెస్​ సాధించినట్లు అనిపిస్తోంది. వచ్చే ఐపీఎల్​లో రెచ్చిపోయి ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఆఖర్లో మెగా ఆక్షన్ ఉన్న నేపథ్యంలో మాహీ ఫ్యూచర్ ఏంటి? అతడ్ని సీఎస్​కే ఏ విధంగా రీటెయిన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి.. ధోని బ్యాడ్మింటన్ వీడియోపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.