SNP
MS Dhoni, LSG vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ధోని ఒక అద్భుతం చేశాడు. ధోని దెబ్బకు స్టేడియం ఊగిపోయింది. ఇంతకీ ధోని ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
MS Dhoni, LSG vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ధోని ఒక అద్భుతం చేశాడు. ధోని దెబ్బకు స్టేడియం ఊగిపోయింది. ఇంతకీ ధోని ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని ఎల్‌ఎస్‌జీ బంపర్ విక్టరీ కొట్టింది. పటిష్టమైన సీఎస్‌కేను ఓడిస్తూ.. నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. మెరుపు బ్యాటింగ్‌తో మరోసారి మెరిశాడు. కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేసి.. చెన్నైకి చివర్లో ఒక మంచి స్కోర్ అందించాడు. ఈ చిన్న కామియో ఇన్నింగ్స్ ఆడే క్రమంలో ధోని బ్యాట్ నుంచి ఓ భయంకరమైన షాట్ వచ్చింది. అది చూసిన అందరికి వింటేజ్ ధోని గుర్తుకు వచ్చాడు. ధోని బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేసే కొంతమంది ప్రేక్షకులు ధోని ఫుల్‌మీల్స్ పెట్టేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ధోని కొట్టిన ఓ సిక్స్ ఏకంగా 101 మీటర్లు వెళ్లిపడింది. ఆ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.
ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినంత కాలం మంచి ఫినిషర్‌గా కొనసాగాడు. ప్రస్తుతం వయసు అయిపోయినా.. తన అభిమానుల కోసం ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. అయినా కూడా అతనిలో ఏ మాత్రం వాడి వేడి తగ్గినట్లు కనిపించడం లేదు. అది అతను ఆడిన షాట్లు బట్టి చెప్పవచ్చు. లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతికి ధోని కొట్టిన భారీ సిక్స్‌తో స్టేడియం దద్దరిల్లింది. ఆ సిక్స్ ఏకంగా 101 మీటర్ల దూరం వెళ్లిపడింది. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు, మూడ ఫోర్లు బాదిన ధోని, ముంబై ఇండియన్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో పాండ్యా ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు బాదిన విషయం అందరికి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో నాలుగు బంతులు మిగిలి ఉన్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోని.. అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి బ్యాటింగ్‌తోనే తన అభిమానులకు పండగ లాంటి ఇన్నింగ్స్ ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానె 36, రవీంద్ర జడేజా 57, మొయిన్ అలీ 30, ధోని 28 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, మోషిన్ ఖాన్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు. ఇక 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేసి.. అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోకు విజయం అందించాడు. అలాగే ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లో 54 పరుగులు చేసి రాణించాడు. అలాగే నికోలస్ పూరన్ 23 పరుగులు చేశాడు. మొత్తం లక్నో ఈ సీజన్‌లో నాలుగో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో ధోని కొట్టిన 101 మీటర్ల సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS DHONI SMASHED 101 METER SIX 🤯🐐 pic.twitter.com/IpCffz04AI
— Johns. (@CricCrazyJohns) April 19, 2024