SNP
SNP
ఇటీవల తన 42వ పుట్టిన రోజు పెంపుడు కుక్కలతో కలిసి చేసుకుని సోషల్ మీడియాను షేకాడించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తాజాగా మరో ఆసక్తికరమైన వ్యాఖ్యతో సంచలనం సృష్టించాడు. ఐపీఎల్‌లో ధోని చెన్నై సూపర్‌కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ టీమ్‌లో సభ్యుడైన దీపక్ చాహర్ గురించి ధోని ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. దీపక్ చాహర్ ఒక డ్రగ్ లాంటివాడని అతను టీమ్‌లో ఉన్నా లేకపోయినా బాధేనని అన్నాడు. చాహర్ టీమ్‌లో లేకపోతే.. వీడు ఎక్కడున్నాడ్రా అని అనిపిస్తోంది. అలాగే అతనుంటే.. వీడేందుకున్నాడ్రా బాబూ అనిపిస్తోందని ధోని తెలిపాడు.
అతని అల్లరి వల్ల అతనుంటే ఇరిటేషన్‌లా లేకుంటే ఏదో వెలితిలా ఉంటుందని ధోని ఉద్దేశం. అయితే దీపక్ చాహర్ ఇప్పుడిప్పుడే కాస్త మెచ్యూర్ అవుతున్నందుకు సంతోషంగా ఉందని, కానీ అతను మెచ్యూర్ అవ్వడం నా జీవితంలో చూడలేనని సరదాగా పేర్కొన్నాడు. అయితే.. ధోని కెప్టెన్సీలోనే దీపక్ చాహర్ మంచి బౌలర్‌గా ఎదిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో చాహర్ కీలక బౌలర్. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ చాహర్ మంచి ప్రదర్శన చేశాడు.
తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత గాయంతో దూరమైన చాహర్ తిరిగి కోలుకుని బరిలోకి దిగాడు. 2023 ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన దీపక్ 13 వికెట్లు పడగొట్టాడు. అయితే.. టీమిండియాలో స్థానం దక్కుతుందని ఆశపడినా.. సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. వెస్టిండీస్‌తో సిరీస్ కోసం దీపక్ చాహర్‌ను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. దీపక్ తరచూ గాయపడుతుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. మరి దీపక్ చాహర్ గురించి ధోని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రింకూ సింగ్.. తగ్గేదేలే! వీడియోతో సెలెక్టర్ల గూబ గుయ్ మనిపించాడుగా..?