SNP
MS Dhoni, CSK vs GT, IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని అంటే కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులు పడిచచ్చిపోతుంటారు. అది ఎందుకో చెప్పే వీడియో తాజాగా సీఎస్‌కే వర్సెస్ జీటీ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
MS Dhoni, CSK vs GT, IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని అంటే కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులు పడిచచ్చిపోతుంటారు. అది ఎందుకో చెప్పే వీడియో తాజాగా సీఎస్‌కే వర్సెస్ జీటీ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 232 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. విజయానికి చాలా దూరంలో అంటే.. 3 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో ఈ ఘటన జరిగింది. ఈ ఐపీఎల్ ధోనికి చివరి సీజన్‌గా అంతా భావిస్తున్నారు. అందుకే కేవలం ధోని ఆట చూసేందుకే చాలా మంది స్టేడియానికి వస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయినా కూడా.. ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అతని ఆట కోసం క్రికెట్ అభిమానులు పడి చచ్చిపోతున్నారు. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో సిక్సులతో అలరించాడు కూడా.. అయితే.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని చాలా సేపే క్రీజ్‌లో ఉన్నాడు. మూడు భారీ సిక్సులతో తన కోసం వచ్చిన క్రికెట్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. కానీ, చెన్నైని మాత్రం గెలిపించలేకపోయాడు.
కాగా, చెన్నై సూపర్ కింగ్స్ చివరి ఓవర్‌లో ఓ వ్యక్తి గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేరుగా మహేంద్ర సింగ్ ధోని వద్దకు వచ్చి.. కాళ్ల మీద పడిపోయాడు. వెంటనే అతన్ని పైకి లేపిన ధోని.. కౌగిలించుకుని, అతని భుజంపై చేయి వేసి అతనితో కొద్దిసేపు మాట్లాడాడు. ఈ లోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ కుర్రాడిని లాక్కొని వెళ్తుంటే.. అతన్ని ఏం అనొద్దని, కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ధోని వాళ్లతో చెప్పాడు. తన అభిమానుల విషయంలో ధోని ఎంత బాధ్యతగా ఉంటాడో కదా అంటూ క్రికెట్ అభిమానులు ఈ విషయంలో ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకే కదా ధోని అంటే అన్ని కోట్ల మంది పడిచచ్చేది అని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా.. తనను కలిసేందుకు అంత రిస్క్ చేసిన వచ్చిన వ్యక్తి పట్ల ధోని చూపించిన కేర్‌కు అంతా ఫిదా అవుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 51 బంతుల్లో 103, శుబ్‌మన్ గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేసి అదరగొట్టారు. సీఎస్‌కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లతో రాణించాడు. ఇక 232 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి చేసి 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్‌కే బ్యాటర్లలో డారిల్ మిచెల్ 34 బంతుల్లో 63, మొయిన్ అలీ 36 బంతుల్లో 56 పరుగులు చేసి రాణించినా.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. ధోని చివర్లో 11 బంతుల్లో 26 పరుగులు చేసి క్రికెట్ అభిమానులను అలరించాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ సత్తా చాటింది. మ్యాచ్ సంగతి పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌లో ధోని, తన అభిమాని విషయంలో చూపిన కేర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Fan touched the feet & then hugged Dhoni – then Mahi saying something to him (maybe to avoid entering the pitch) later trying to protect the fan from the guard. ⭐ pic.twitter.com/OYEGyLa9r4
— Johns. (@CricCrazyJohns) May 11, 2024