iDreamPost
android-app
ios-app

MS Dhoni: RCBతో వివాదం.. ధోని బాధకు ఈ కామెంట్సే సాక్ష్యం!

  • Published May 20, 2024 | 9:06 PM Updated Updated May 21, 2024 | 7:15 AM

RCBతో వివాదం తర్వాత ధోని చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. దీంతో ధోని అంత బాధపడ్డాడా? అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ధోని ఏమన్నాడంటే?

RCBతో వివాదం తర్వాత ధోని చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. దీంతో ధోని అంత బాధపడ్డాడా? అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: RCBతో వివాదం.. ధోని బాధకు ఈ కామెంట్సే సాక్ష్యం!

ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అభినందించడానికి ధోని రెడీగా ఉన్నాడు. కానీ గెలిచిన ఉత్సహంలో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు ఎంతకీ రాకపోవడంతో, చూసి చూసి విసుగెత్తిపోయిన మిస్టర్ కూల్.. గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లను ధోని అవమానించాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక ఈ వివాదం తర్వాత ధోని చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. దీంతో ధోని అంత బాధపడ్డాడా? అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మిస్టర్ కూల్ చేసిన కామెంట్స్ ఏంటి?

తన తప్పు లేకున్నా.. తనపై విమర్శలు వస్తే, ఏ వ్యక్తి అయినా బాధపడతాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అదే బాధలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే? ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత ఏర్పడిన కాంట్రవర్సీ కారణంగా.. ఏ తప్పు లేకుండానే కొందరు ధోనిని విమర్శించారు. ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వారిని అవమానించాడు అంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ధోని చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

“ఒక నాయకుడిగా మీరు ప్రజల నుంచి గౌరవాన్ని సంపాదించుకోవాలి. అంతే తప్ప గౌరవాన్ని ఆదేశించడం, డిమాండ్ చేయడం మీరు చేయకూడదు, చేయలేదు. కేవలం మన మంచితనం తోటే గౌరవాన్ని దక్కించుకోవాలి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆర్సీబీతో ఏర్పడిన కాంట్రవర్సీలో తన తప్పు లేకున్నా తనపై విమర్శలు రావడంతోనే, బాధలో ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ధోనిలో ఇంత బాధ ఉందా? అంటూ ఇంకొందరు రాసుకొస్తున్నారు. మరి ఆర్సీబీతో జరిగిన కాంట్రవర్సీ కారణంగా ధోని ఈ వ్యాఖ్యలు చేశాడా? లేక మరేదైనా ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.