iDreamPost

9 ఏళ్ల క్రితం మ్యాక్స్‌వెల్‌ గురించి ధోని మాట్లాడితే అంతా తిట్టారు! అసలు ధోని ఏం అన్నాడు..?

  • Published Nov 08, 2023 | 4:00 PMUpdated Nov 09, 2023 | 1:21 PM

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌ పేరు మారుమోగిపోతుంది. అయితే.. మ్యాక్స్‌వెల్‌ ఇలాంటిదేదో చేస్తాడని ధోని ఎప్పుడో పసిగట్టాడు. కానీ, అప్పుడు అంతా ధోనిని తిట్టారు. కానీ, ఇప్పుడు అదే నిజమైంది. ఇంతకీ ధోని మ్యాక్సీ గురించి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌ పేరు మారుమోగిపోతుంది. అయితే.. మ్యాక్స్‌వెల్‌ ఇలాంటిదేదో చేస్తాడని ధోని ఎప్పుడో పసిగట్టాడు. కానీ, అప్పుడు అంతా ధోనిని తిట్టారు. కానీ, ఇప్పుడు అదే నిజమైంది. ఇంతకీ ధోని మ్యాక్సీ గురించి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 08, 2023 | 4:00 PMUpdated Nov 09, 2023 | 1:21 PM
9 ఏళ్ల క్రితం మ్యాక్స్‌వెల్‌ గురించి ధోని మాట్లాడితే అంతా తిట్టారు! అసలు ధోని ఏం అన్నాడు..?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో మంగళవారం క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందించే మ్యాచ్‌ జరిగింది. ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌.. అద్భుతంగా సాగింది. ఐదు సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియాపై పసికూన ఆఫ్ఘాన్‌ జట్టు ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించింది. పటిష్టమైన ఆసీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొన్న ఆఫ్ఘాన్‌.. 291 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇక్కడే ఆఫ్ఘాన్‌ సగం మ్యాచ్‌ గెలిచినంత పనిచేసింది. ఇక బౌలింగ్‌లో కూడా ఆస్ట్రేలియాను వణికించిన ఆఫ్ఘాన్‌ బౌలర్లు 91 పరుగులకే 7 వికెట్లు కూల్చారు. కానీ, మ్యాక్స్‌వెల్‌ ఒక్కడే.. ఓటమికి ఆస్ట్రేలియాకు మధ్య నిలబడిపోయాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యాద్భుతమైన ఇన్నింగ్స్‌తో.. ఓటమి కోరల్లో చిక్కుకున్న తన జట్టుకు విజయాన్ని అందించాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మ్యాక్స్‌వెల్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయితే.. మ్యాక్స్‌వెల్‌ ఇలాంటి అద్భుతం చేస్తాడని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని 9 ఏళ్ల క్రితమే ఊహించాడు. అప్పటికీ మ్యాక్స్‌వెల్‌ పెద్ద ప్లేయర్‌ కాదు. కానీ, అతనిలోని స్పార్క్‌ను పసిగట్టిన ధోని.. ఏకంగా సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. వాళ్లిద్దరు కలగలిపితే.. మ్యాక్స్‌వెల్‌ అంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో అందరూ ధోనిని విమర్శించారు. ఓ బచ్చా క్రికెటర్‌ను సచిన్‌, సెహ్వాగ్‌తో పోల్చడం ఏంటంటూ మండిపడ్డారు. 2014 మే 7న ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య ఓ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సులతో విరుచుకుపడ్డాడు.

మ్యాక్స్‌వెల్‌ ఆట తీరును వికెట్ల వెనుక నుంచి చూసిన ధోని.. మ్యాచ్‌ తర్వాత మ్యాక్సీపై ప్రశంసలు కురిపించాడు. ధోని మాట్లాడుతూ..‘మ్యాక్స్‌వెల్‌ చాలా టాలెంటెడ్‌ ప్లేయర్‌. అతను సిక్సులు కొడుతున్న విధానం చూస్తుంటే.. సచిన్‌, సెహ్వాగ్‌ల టాలెంట్‌ను మిక్స్‌ చేస్తే మ్యాక్స్‌వెల్‌’ అంటూ పేర్కొన్నాడు. అప్పట్లో ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఒక సాధారణ ప్లేయర్‌ను ధోని ఎందుకు ఇంతలా చెబుతున్నాడంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, అప్పుడు ధోని చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలు అయ్యాయి. ఆఫ్ఘాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్సే అందుకు ఉదాహరణ. ఎంతో పరిణితి చెందిన ప్లేయర్‌గా వికెట్‌ కాపాడుకుంటూ.. ఓ భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో అగ్రెసివ్‌గా ఆడుతూ.. సచిన్‌, సెహ్వాగ్‌ను మిక్స్‌ చేసి ఆడాడు. అందుకే ధోని ఏదైనా చెబితే ఊరికే చెప్పడు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. కాస్త ఆలస్యమైనా.. అది జరిగి తీరుతుంది. మరి ధోని మ్యాక్స్‌వెల్‌పై చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి