iDreamPost
android-app
ios-app

ధోని క్రేజ్ అంటే ఇది.. గంటల వ్యవధిలో వారిని అపర కుబేరులను చేశాడు!

  • Author Soma Sekhar Published - 03:08 PM, Mon - 26 June 23
  • Author Soma Sekhar Published - 03:08 PM, Mon - 26 June 23
ధోని క్రేజ్ అంటే ఇది.. గంటల వ్యవధిలో వారిని అపర కుబేరులను చేశాడు!

మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో ఈ నేమ్ ఓ బ్రాండ్. మిస్టర్ కూల్ గా టీమిండియాకు మూడు ఐసీసీ టోర్నీలతో పాటుగా ఎన్నో మరపురాని విజయాలను తన కెప్టెన్సీలో అందించాడు. ఇక తన బ్యాటింగ్ తో, కెప్టెన్సీతో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ధోని గురించి ఏ చిన్న వార్త తెలిసినా చాలు అభిమానులు దాన్ని క్షణాల్లో ట్రెండింగ్ లోకి తీసుకొస్తారు. తాజాగా ధోనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో కారణంగా ఓ కంపెనీ ఓనర్లు అపర కుబేరులుగా మారారు. మరి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఓ వీడియో గత కొన్ని గంటలుగా ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వీడియోలో మిస్టర్ కూల్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ.. తన ట్యాబ్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కనిపించాడు. దాంతో క్యాండి క్రష్ యాజమాన్యం అపర కుబేరులుగా మారింది. అదేంటి? ధోని క్యాండీ క్రష్ ఆడితే.. వాళ్లు కుబేరులుగా మారడం అనుకుంటున్నారా? దానికీ ఓ కారణం ఉందండి బాబు. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ధోనికి చాక్లెట్లు ఆఫర్ చేయడానికి వచ్చింది ఎయిర్ హోస్టెస్. అప్పుడు ధోని తన ట్యాబ్ లో క్యాండీ క్రష్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దాంతో ఈ వీడియో అభిమానులు మరుక్షణమే క్యాండీ క్రష్ గేమ్ ను డౌన్లోడ్ చేసుకోవడం మెుదలు పెట్టారు.

ఇక ఈ డౌన్లోడ్ ఏ రేంజ్ లో సాగిందంటే.. కేవలం 3 గంటల వ్యవధిలోనే 36 లక్షల మంది ఈ గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక ఒక్కసారిగా తమకు 3.6 మిలియన్ల డౌన్లోడ్స్ కావడంతో.. క్యాండీ క్రష్ యాజమాన్యం అవాక్కైంది. దీనికి గల కారణం ఏంటా? అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది. దీంతో మిస్టర్ కూల్ ధోనికి క్యాండీ క్రష్ యాజమాన్యం ట్వీటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది. కేవలం ఇది ధోని మేనియా వల్లే సాధ్యం అయ్యింది అంటూ ప్రశంసించింది. మరి ధోని క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటున్నారు అభిమానులు. అయితే ఈ వీడియో చూసిన కొంత మంది.. ధోని ఆడింది క్యాండీ క్రష్ కాదని, అది పెట్ రెస్క్యూ సాగా గేమ్ అని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ధోనిని అభిమానించే వారు ఇంతమంది ఉన్నారా? అంటూ అవాక్కవుతున్నారు కొంతమంది.