iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ధోని కావాలనే రనౌట్‌ అయ్యాడు: యువరాజ్‌ తండ్రి

  • Published Jul 12, 2023 | 7:57 AM Updated Updated Jul 12, 2023 | 7:57 AM
  • Published Jul 12, 2023 | 7:57 AMUpdated Jul 12, 2023 | 7:57 AM
వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ధోని కావాలనే రనౌట్‌ అయ్యాడు: యువరాజ్‌ తండ్రి

భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని. భారత క్రికెట్‌ చరిత్రలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ ఎవరంటే ధోని పేరే చెబుతారు. అలాంటి వ్యక్తిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన కీలక దశలో ప్రపంచంలోనే బెస్ట్‌ ఫినిషర్‌గా పేరున్న ధోని రనౌట్‌ అయ్యాడు. అక్కడే టీమిండియా మ్యాచ్‌ ఓడిపోయిందని అంతా భావిస్తారు.

ధోని అవుట్‌ కాకుంటే విజయం భారత్‌దే అనే నమ్మకం క్రికెట్‌ అభిమానుల్లో బలంగా ఉంది. కానీ.. మార్టిన్‌ గప్టిల్‌ డైరెక్ట్‌ త్రోతో అరఇంచు తేడాతో ధోని రనౌట్‌ అయ్యాడు. వికెట్ల మధ్య చిరుతపులిలా పరిగెత్తే ధోని.. వరల్డ్‌ కప్‌ సెమీస్‌ లాంటి కీలక మ్యాచ్‌లో గెలిపించాల్సిన సమయంలో రనౌట్‌ అవ్వడంతో.. తొలి సారి ధోని కూడా ఎమోషనల్‌ అయ్యాడు. అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ధోనిని అలా చూసి ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్ సైతం కన్నీళ్లు పెట్టకున్నారు. ఆ వరల్డ్‌ కప్‌ భారత క్రికెట్‌ అభిమానులకు ఎంతో బాధను మిగిల్చింది. అయితే.. ఆ మ్యాచ్‌లో ధోని కావాలనే రనౌట్‌ అయ్యాడని, అతనో పెద్ద స్వార్థపరుడని యువరాజ్‌ సింగ్‌ తండ్రి ఆరోపించాడు. తన కెప్టెన్సీలో తప్పితే.. మరే భారత కెప్టెన్‌ కూడా వరల్డ్‌ కప్‌ గెలవకూడదనే స్వార్థతోనే ధోని కావాలనే రనౌట్‌ అయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ధోని సామర్థ్యం మేరకు ఆడి ఉంటే.. ఆ మ్యాచ్‌లో టీమిండియాదే విజయమని, అలా కాకుండా కావాలనే నెమ్మదిగా ఆడాడని, దాంతో బాగా ఆడుతున్న జడేజాపై కూడా ఒత్తిడి పెరిగి అతను అవుట్‌ అయ్యాడు. ఇక గెలిపించాల్సిన స్థానంలోకి తాను రాగానే.. రనౌట్‌ అయ్యాడని అన్నాడు. అయితే.. టీమిండియా రెండు వరల్డ్‌ కప్‌లు(టీ20 2007, వన్డే 2011) గెలవడానికి కారణమైన యువరాజ్‌ సింగ్‌కు సరైన గుర్తింపు దక్కలేదని, ఆ క్రెడిట్‌ అంతా ధోని కొట్టేశాడని యోగ్‌రాజ్‌కు కోపం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఆయన ధోనిపై పలు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీ20 చరిత్రలోనే థ్రిల్లింగ్ మ్యాచ్.. రింకూ సింగ్ ను మించిన బెస్ట్ ఫినిషర్!