Somesekhar
టీమిండియా స్టార్ ప్లేయర్ పై ప్రశంల వర్షం కురిపించాడు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్. ఆ ఆటగాడు ప్రపంచ క్రికెట్ కు దేవుడు ఇచ్చిన వరం అంటూ అక్రమ్ కితాబిచ్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
టీమిండియా స్టార్ ప్లేయర్ పై ప్రశంల వర్షం కురిపించాడు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్. ఆ ఆటగాడు ప్రపంచ క్రికెట్ కు దేవుడు ఇచ్చిన వరం అంటూ అక్రమ్ కితాబిచ్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
Somesekhar
ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. తమ బ్యాట్ తో, బాల్ తో వరల్డ్ క్రికెట్ ప్రేమికులను వారు అలరించారు. అయితే లెజెండ్స్ అందరూ ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకోవడంలో సఫలం కాలేదు. కొందరు మాత్రమే క్రికెట్ పై చెరగని ముద్రవేసి కారణ జన్ములుగా అభిమానుల మనసు దోచుకున్నారు. అలా ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ ప్రపంచ క్రిికెట్ కు దేవుడు ఇచ్చిన వరం అంటూ ప్రశంసలు కురిపించాడు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్. మరి దేవుడు ఇచ్చిన బహుమతి అంటూ పాక్ దిగ్గజం కితాబు అందుకున్న ఆ భారత ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
పాకిస్తాన్ ప్లేయర్లు టీమిండియా ఆటగాళ్లపై ఎప్పుడూ విమర్శలే గుప్పిస్తారు. టైమ్ దొరికితే చాలు భారత ప్లేయర్లపై మాటల యుద్ధానికి దిగుతుంటారు పాక్ ఆటగాళ్లు. అలాంటి వారు ఈ మధ్య కాలంలో కాస్త బుద్ది తెచ్చుకున్నట్లున్నారు. టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాక్ దిగ్గజం వసీం అక్రమ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ఆకాశానికి ఎత్తేశాడు. “ప్రపంచ క్రికెట్ కు మహేంద్రసింగ్ ధోని దేవుడు ఇచ్చిన వరం” అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ వరల్డ్ క్రికెట్ లో ఆసక్తిగా మారింది.
ఎప్పుడూ టీమిండియా ప్లేయర్లపై పడి ఏడవడమే తప్ప.. ప్రశంసలు కురిపించడం తెలియని పాక్ ఆటగాళ్లు.. ఒక్కసారిగా ఈ మధ్య కాలంలో ఇలా మారిపోయారు ఏంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ప్రపంచ క్రికెట్ పై ధోని వేసిన ముద్రకు ఎవ్వరైన అభిమాని కావాల్సిందే. ఆటతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ, కెప్టెన్సీతో వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు ధోని. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో తన ఫినిషర్ పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడు. చివర్లో బ్యాటింగ్ కు దిగి వింటేజ్ ధనాధన్ షాట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరి ప్రపంచ క్రికెట్ కు దేవుడిచ్చిన వరం ధోని అన్న వసీం అక్రమ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Wasim Akram said “MS Dhoni is a God’s gift to the World Cricket”. [Sportskeeda] pic.twitter.com/DYcivSguXG
— Johns. (@CricCrazyJohns) May 8, 2024