iDreamPost
android-app
ios-app

MS Dhoni: IPL 2024 కోసం ధోని చూడండి ఎలా రెడీ అవుతున్నాడో! ఫ్యాన్స్‌కు పండగే

  • Published Dec 05, 2023 | 11:41 AM Updated Updated Dec 05, 2023 | 11:41 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా .. ధోనికి ఇంకా క్రికెట్‌ లోకంలో క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. వారి కోసమే ధోని సైతం ఐపీఎల్‌ 2024 కోసం ఒక రేంజ్‌లో రెడీ అవుతున్నాడు. ఇంతకీ ధోని ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా .. ధోనికి ఇంకా క్రికెట్‌ లోకంలో క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. వారి కోసమే ధోని సైతం ఐపీఎల్‌ 2024 కోసం ఒక రేంజ్‌లో రెడీ అవుతున్నాడు. ఇంతకీ ధోని ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 05, 2023 | 11:41 AMUpdated Dec 05, 2023 | 11:41 AM
MS Dhoni: IPL 2024 కోసం ధోని చూడండి ఎలా రెడీ అవుతున్నాడో! ఫ్యాన్స్‌కు పండగే

టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ధోనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిపోయి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఫాలోయింగ్‌ తగ్గని ఏకైక క్రికెట్‌ ధోనినే కావచ్చు. క్రికెట్‌కు ఎప్పుడో గుడ్‌బై చెప్పినా.. ఇప్పటికీ ధోని ఏం చేసినా హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంది. అది ధోనికి ఉన్న క్రేజ్‌. అయితే.. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోని ఐపీఎల్‌ 2024 సీజన్‌కు రెడీ అవుతున్నాడు.

ఐపీఎల్‌లో ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టును ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు ధోని. అయితే.. ధోనికి ఆ జట్టులో వాటా కూడా ఉన్నట్లు అప్పుడప్పుడు వార్తలు కూడా వస్తూ ఉంటాయి. నిజానికి ధోని ఐపీఎల్‌ 2023 తర్వాత ఆటకు పూర్తిగా దూరం అవుతాడని అంతా భావించారు. కానీ, ఐపీఎల్‌ 2024లో కూడా ఆడాలని అభిమానులు కోరినందుకు.. ఇన్నాళ్లు తనను అభిమానిస్తున్న వారి కోసం ఐపీఎల్‌ 2024 కూడా ఆడుతానని ధోని.. గత సీజన్‌ సందర్భంగా వెళ్లడించిన విషయం తెలిసిందే. దీంతో.. ఐపీఎల్‌ 2024లో ధోని ఆట చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక అభిమానులను అలరించడంతో పాటు, తన జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేసేందుకు ధోని.. ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌తో పాటు.. ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో తెగ వర్క్‌ అవుట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ధోని జిమ్‌లో వర్క్‌ అవుట్‌ చేస్తూ.. సూపర్‌ బాడీతో ఎంతో ఫిట్‌గా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే.. ఈ ఫొటోల్లో ధోని లాంగ్‌ హెయిర్‌తో ఉండటం అభిమానులను ఎంతో సంతోష పెడుతోంది. ధోని తన కెరీర్‌ స్టార్టింగ్‌లో లాంగ్‌ హెయిర్‌ స్టైల్‌తో అందరిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన చివరి ఐపీఎల్‌ సీజన్‌లో కూడా ధోని ఆ లుక్‌లోనే బరిలోకి దిగేతే చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. చూడాలి మరి ధోని ఎలాంటి లుక్‌లో ఐపీఎల్‌ 2024 ఆడతాడో. మరి ధోని జిమ్‌లో దిగిన ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetceltabet girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom