iDreamPost
android-app
ios-app

MS Dhoni: 15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్ కేసు పెట్టిన ధోని.. అసలేం జరిగిందంటే?

  • Published Jan 05, 2024 | 4:56 PM Updated Updated Jan 05, 2024 | 4:56 PM

భారత మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని తన చిన్ననాటి స్నేహితుడిపై క్రిమినల్ కేసు పెట్టాడు. రూ. 15 కోట్లు ఆర్థిక మోసం చేశాడని కోర్టును ఆశ్రయించాడు మిస్టర్ కూల్.

భారత మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని తన చిన్ననాటి స్నేహితుడిపై క్రిమినల్ కేసు పెట్టాడు. రూ. 15 కోట్లు ఆర్థిక మోసం చేశాడని కోర్టును ఆశ్రయించాడు మిస్టర్ కూల్.

MS Dhoni: 15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్ కేసు పెట్టిన ధోని.. అసలేం జరిగిందంటే?

సమాజంలో ఇటీవల కాలంలో నమ్మించి మోసం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. ఇటీవలే టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ను అతడి ఫ్రెండ్ మోసం చేసిన వార్త ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మర్చిపోకముందే.. మరో క్రిమినల్ కేసు టీమిండియా క్రికెట్ లో నమోదు అయ్యింది. భారత మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని తన చిన్ననాటి స్నేహితుడిపై క్రిమినల్ కేసు పెట్టాడు. రూ. 15 కోట్లు ఆర్థిక మోసం చేశాడని కోర్టును ఆశ్రయించాడు మిస్టర్ కూల్. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మహేంద్రసింగ్ ధోని.. ఎప్పుడూ క్రికెట్ కు సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలిచేవాడు. కానీ తాజాగా ఓ క్రిమినల్ కేసుతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. అసలు విషయం ఏంటేంటే? ధోని తన చిన్ననాటి స్నేహితుడు, చిరకాల బిజినెస్ పార్ట్ నర్ మిహిర్ దివాకర్ పై రూ. 15 కోట్లు మోసం చేశాడని క్రిమినల్ కేసు పెట్టాడు. ఈ మోసంలో అతడితో పాటుగా టీమిండియా మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సౌమ్య బిస్వాస్ పేరు కూడా ఈ లిస్ట్ లో ఉండటం గమనార్హం.

మహేంద్రసింగ్ ధోని పేరుతో గ్లోబల్ క్రికెట్ అకాడమీని నిర్మించేందుకు 2017లో మిహిర్ దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నాడట. కేవలం భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా అకాడమీలను నిర్మించేందుకు భూమి కొనుగోలు చేశాడట దివాకర్. కానీ ఇప్పటి వరకు ఆ పనులు ముందుకుసాగటం లేదంట. దీంతో ఒప్పందం ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ధోనికి డివిడెండ్ చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వారిద్దరు ధోని ఎలాంటి సొమ్ము చెల్లించలేదు. దీంతో ఈ వ్యవహారంపై కోర్టుకు ఎక్కాడు ధోని.

ఈ క్రమంలోనే 2021 ఆగస్ట్ లో ఆర్కా స్పోర్ట్స్ కు మంజూరు చేసిన అధికార లేఖను తిరిగి వెనక్కి తీసుకోవడమే కాక.. వారికి నోటిసులు సైతం జారీ చేయించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక.. విధి అసోసియేట్స్ ద్వారా ధోనికి ప్రాతినిథ్యం వహిస్తున్న దయానంద్ సింగ్, ఆర్కా స్పోర్ట్స్ తమను రూ. 15 కోట్లకు పైగా మోసం చేశాయంటూ.. వారిపై క్రిమినల్ కేసు పెట్టాడు. ఈ మేరకు ధోని రాంచీ కోర్టులో కేసు వేసినట్లు సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.