iDreamPost

ధోని దగ్గర ఎన్ని బైకులున్నాయో! షోరూమ్‌లో కూడా అన్ని ఉండవ్‌..

  • Published Jul 18, 2023 | 8:17 AMUpdated Jul 18, 2023 | 8:17 AM
  • Published Jul 18, 2023 | 8:17 AMUpdated Jul 18, 2023 | 8:17 AM
ధోని దగ్గర ఎన్ని బైకులున్నాయో! షోరూమ్‌లో కూడా అన్ని ఉండవ్‌..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి బైకులంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైకులంటే పడి చచ్చే మహీ భాయ్‌.. ఏ కొత్త మోడల్‌ కనిపించినా దాన్ని తన ఇంట్లో ఉన్న ఓ పెద్ద షెడ్‌లో పెట్టేస్తాడు. వాటిని నడుపుతాడో లేదో తెలియదు కానీ, తనకు నచ్చిన బైక్‌ మాత్రం తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. ఇప్పటికే ధోని దగ్గర చాలా బైకులు ఉన్నాయని దాదాపు అందరికీ తెలిసిందే. కానీ, ఎన్ని ఉన్నాయ్‌, వాటిని ఎక్కడ ఎలా పెట్టాడు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ధోని కూడా వాటి గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. వాటికి సంబంధించి వీడియోను కూడా ఎప్పుడూ బయట పెట్టలేదు.

అయితే తాజాగా టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కొంతమందితో కలిసి ధోని దగ్గరికి వెళ్లాడు. వారికి ధోని తన బైక్‌ల, కార్ల కలెక‌్షన్‌ను చూపించాడు. ఆ సమయంలో తీసిని వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే.. ఆ వీడియోలో ఎన్ని బైకులు ఉన్నాయో లెక్కపెట్టడం కూడా కష్టంగా మారింది. అన్ని బైకులు ఉన్నాయి. అది చిన్నా చితకా షెడ్‌ కాదండోయ్‌.. రెండు మూడు పెద్ద పెద్ద షోరూమ్‌లు కలిపితే అదొక్కటే. అంత పెద్దగా ఉంది మరీ.

అందులో రెండో ఫోర్లలో బైకులు నిండిపోయి ఉన్నాయి. మధ్య మధ్యలో వింటేజ్‌ మోడల్‌ కార్లు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా మాత్రం బైకులే ఉన్నాయి. ఎన్ని రకాల, ఎన్ని కంపెనీల బైకులు ఉన్నాయో ధోని మాత్రమే తెలిసినట్టు ఉంది. వాటిని వాడుతాడో లేదో తెలియదు కానీ, వాటిని ఎప్పుడూ మంచి కండీషన్లో ఉంచుకుంటాడట. ధోనికి బైకుల మీద ఉన్న పిచ్చి ప్రేమ అలాంటిది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ధోని బైకుల కలెక‌్షన్‌ వీడియో వైరల్‌ అవుతుంది. కింద ఉన్న వీడియో మీరూ చూసేసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెహ్వాగ్‌ది అసలు ఆటే కాదు.. పాక్‌లో పుట్టి ఉంటేనా: పాక్‌ క్రికెటర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి