రోహిత్​ ఈ స్థాయిలో ఉన్నాడంటే అతడే కారణం: గంభీర్

  • Author singhj Published - 01:05 PM, Wed - 13 September 23
  • Author singhj Published - 01:05 PM, Wed - 13 September 23
రోహిత్​ ఈ స్థాయిలో ఉన్నాడంటే అతడే కారణం: గంభీర్

రోహిత్ శర్మ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన స్టైలిష్ బ్యాటింగ్​తో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. భారత జట్టులోకి బ్యాట్స్​మన్​గా అడుగుపెట్టాడు రోహిత్. అయితే బ్యాటింగ్​తో పాటు ఆఫ్ స్పిన్నర్​గానూ, ఫీల్డర్​గానూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ 2011 వరల్డ్ కప్ టీమ్​లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత వరుసగా విఫలమవ్వడంతో అతడి పనైందని అంతా అనుకున్నారు. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్ ఫేట్ మారిపోయింది. ఆ టోర్నీలో ఓపెనర్​గా ప్రమోషన్ రావడంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్​ దూకుడు ఎక్కడా తగ్గలేదు. సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు కొడుతూ టీమ్​లో టాప్​ ప్లేయర్​గా మారిపోయాడు. ఐపీఎల్​లోనూ ముంబై ఇండియన్స్​ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ట్రోఫీలు అందించాడు. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టి సక్సెస్​ఫుల్​గా టీమ్​ను ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఒక సమయంలో మాత్రం రోహిత్ బ్యాడ్ ఫేస్​ను ఎదుర్కొన్నాడు. దీని గురించి భారత దిగ్గజ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫామ్ కోల్పోయి రన్స్ చేసేందుకు ఇబ్బందిపడుతున్న టైమ్​లో రోహిత్​లో ఎంఎస్ ధోని నమ్మకం కలిగించాడని అన్నాడు.

ఏడో స్థానంలో బ్యాటింగ్​ చేసే రోహిత్​కు ఓపెనర్​గా ఛాన్స్ కల్పించి నేడు ఈ స్థాయికి ధోని చేర్చాడని గంభీర్ చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సపోర్ట్ వల్లే రోహిత్ శర్మ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడని గంభీర్ ప్రపంచానికి తెలియజేశాడు. కెరీర్ మొదట్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్.. అనంతరం వరల్డ్​లోనే బెస్ట్ ప్లేయర్​గా ఎదిగాడన్నాడు. టాలెంట్​ ఉన్నవారిని గుర్తించడంలో ధోని స్టైలే వేరని.. రోహిత్​కు అండగా నిలిచాడని గంభీర్ గుర్తుచేశాడు. ధోని సపోర్ట్ ఇచ్చినందు వల్లే రోహిత్​లో ఇంతటి విధ్వంసక బ్యాటర్​ను చూడగలుగుతున్నామని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఎవరీ దునిత్ వెల్లలాగే!

Show comments