iDreamPost

MS Dhoni: ధోని ఇంత సెల్ఫిషా? పేరు కోసం ఇంత దిగజారాలా? వీడియో వైరల్

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని చేసిన ఆ ఒక్క పని అతడిని స్వార్థపరుడిగా చేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అభిమానులు ధోనిపై కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందంటే?

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని చేసిన ఆ ఒక్క పని అతడిని స్వార్థపరుడిగా చేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అభిమానులు ధోనిపై కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందంటే?

MS Dhoni: ధోని ఇంత సెల్ఫిషా? పేరు కోసం ఇంత దిగజారాలా? వీడియో వైరల్

మహేంద్రసింగ్ ధోని.. స్టేడియంలోకి అడుగుపెడుతున్నాడు అంటే చాలు, ప్రేక్షకుల, ఫ్యాన్స్ అరుపులతో గ్రౌండ్ దద్దరిల్లుతుంది. ఇక బెస్ట్ ఫినిషర్ గా వరల్డ్ క్రికెట్ లో తనకు పేరు ఉండనే ఉంది. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా క్లీన్ క్రికెటర్ గా ఉన్న అతికొద్ది మంది ఆటగాళ్లలో ధోని ఒకడు. అలాంటి మిస్టర్ కూల్ పై సొంత అభిమానులే కోపంగ ఉన్నారు. దానికి కారణం.. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని చేసిన ఓ సెల్ఫిష్ పనే. అసలేం జరిగింది? పిచ్చిగా అభిమానించే అభిమానులు ధోనిపై కోపంగా ఉండటానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో చెన్నైని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది పంజాబ్. చెన్నై నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ ను 17.5 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో 10 మ్యాచ్ ల్లో 4 విజయాలతో తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ధోని చేసిన ఆ ఒక్క పని అభిమానులకు నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ధోనిని స్వార్థపరుడు అంటూ తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే?

ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు అర్షదీప్ సింగ్. క్రీజ్ లో ధోని-డార్లి మిచెల్ ఉన్నారు. స్ట్రైకింగ్ లో ధోని ఉన్నాడు. సహజంగానే ధోని చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నాడంటే బౌలర్లకు కాస్త ఒత్తిడి ఉంటుంది. దాంతో తొలి బంతిని వైడ్ గా వేశాడు అర్షదీప్. నెక్ట్స్ బాల్ ను ఫోర్ బాదాడు. ఆ తర్వాత మరో వైడ్ వేశాడు. ఇక మూడో బాల్ ను భారీ షాట్ కొట్టాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బంతి గాల్లోకి లేచింది. దీంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న డార్లి మిచెల్ రన్ కోసం పరిగెత్తాడు. కానీ ధోని మాత్రం అతడిని వెనక్కి వెళ్లమన్నాడు. అయితే అప్పటికే అతడు ధోని వైపు క్రీజ్ లోకి వెళ్లి.. మళ్లీ తనవైపు తిరిగి వచ్చాడు.

ఈలోపు ఫీల్డర్ బాల్ ను త్రో చేశాడు. కానీ బాల్ వికెట్లకు తాగకపోవడంతో.. మిచెల్ రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత బాల్ కు పరుగులేమీ రాలేదు. 5వ బంతిని సిక్సర్ గా మలిచిన ధోని.. చివరి బంతికి రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో 11 బంతుల్లో ఫోర్, సిక్స్ తో 14 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. దీంతో మిచెల్ కు స్ట్రైకింగ్ ఇవ్వకపోవడంతో. ధోనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిచెల్ కు స్ట్రైకింగ్ ఇవ్వనందుకు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత హిట్టరైనా అవతల ఉంది కూడా బ్యాటరే కదా? స్ట్రైకింగ్ ఇవ్వాల్సింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ధోని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి