iDreamPost
android-app
ios-app

CSKను సొంత గడ్డపై ఓడించిన పంజాబ్‌! ధోని, రిజ్వీ వల్లే ఓటమి?

  • Published May 02, 2024 | 8:27 AM Updated Updated May 02, 2024 | 8:27 AM

MS Dhoni, Sameer Rizvi: ప్రపంచంలోనే బెస్ట్‌ ఫినిషర్‌గా ధోనికి పేరుంది. కానీ, పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని కారణంగానే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైందనే విమర్శలు వస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

MS Dhoni, Sameer Rizvi: ప్రపంచంలోనే బెస్ట్‌ ఫినిషర్‌గా ధోనికి పేరుంది. కానీ, పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని కారణంగానే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైందనే విమర్శలు వస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published May 02, 2024 | 8:27 AMUpdated May 02, 2024 | 8:27 AM
CSKను సొంత గడ్డపై ఓడించిన పంజాబ్‌! ధోని, రిజ్వీ వల్లే ఓటమి?

ఐపీఎల్‌ 2024లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైంది. తమ సొంత గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో చెన్నై ఓటమిని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ టాస్‌ ఓడిపోవడమే వారి ఓటమికి కారణంగా తెలుస్తోంది. దాంతో పాటు.. ఆ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ ధోని కూడా చెన్నై ఓటమికి కారణంగా నిలిచాడని సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 8 ఓవర్ల వరకు పటిష్టస్థితిలో నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. పంజాబ్‌ స్పిన్నర్ల దెబ్బకు ఒక్కసారిగా కూదేలైంది. అలాగే చివర్లో ధోని, ఇక రిజ్వా చేసిన పని సీఎస్‌కే కొంపముంచింది. మరి ధోని, రిజ్వీ ఏం చేశారో ఇప్పుడు చూద్దాం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే మంచి స్టార్ట్‌ ఇచ్చారు. పవర్ ప్లేలో చెన్నై వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో నిలకడగా ఆడుతున్న సీఎస్‌కేను పంజాబ్‌ బౌలర్‌ హర్‌ప్రీత్ బ్రార్ దెబ్బతీశాడు. వరుస బంతుల్లో అజింక్యా రహానే, శివమ్ దూబే‌లను పెవిలియన్ చేర్చాడు. 29 పరుగులతో ఆడుతున్న రహానేను క్యాచ్ ఔట్ చేసిన హర్‌ప్రీత్ బ్రార్.. నెక్ట్స్‌ బాల్‌కే శివమ్ దూబే‌ను వికెట్ల ముందు దురకబుచ్చుకున్నాడు. స్పిన్‌ బౌలింగ్‌ను సులువుగా ఎదుర్కొంటూ హీరోలా ఆడతాడు అనుకున్న దూబే.. గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

ఆ వెంటనే జడేజా సైతం కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి సమీర్ రిజ్వీ రాగా.. రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వెంటవెంటనే మూడు వికెట్లు పడటంతో పాటు, పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గైక్వాడ్‌-రిజ్వీ సింగిల్స్‌కే పరిమితం అయ్యారు. అయితే.. దూకుడుగా ఆడతాడనే పేరున్న సమీర్‌ రిజ్వీ మరీ నెమ్మదిగా ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే జిడ్డు బ్యాటింగ్‌ చేశాడు. 23 బంతుల్లో కేవలం ఒక ఫోర్‌తో, 91.30 స్ట్రైక్‌ రేట్‌తో 21 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్లు కాపాడే ప్రయత్నంలో రన్‌రేట్‌ను మర్చిపోయాడు. ఇక ఈ సీజన్‌లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్‌ బ్యాటింగ్‌తో క్రికెట్‌ అభిమానులను ఒక రేంజ్‌లో అలరిస్తున్న సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ధోని.. ఈ మ్యాచ్‌లో మాత్రం మెరవలేకపోయాడు.

11 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి.. స్లోగా బ్యాటింగ్‌ చేశాడు. పైగా డారిల్‌ మిచెల్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్‌కు స్ట్రైక్‌ ఇవ్వకుండా, సింగిల్స్‌ తీయకుండా, బాల్స్‌ను డాట్‌ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కేవలం 162 పరుగులకే పరిమితం అయి ఓటమి పాలైందంటే.. అందుకు ధోని, సమీర్‌ రిజ్వీ జిడ్డు బ్యాటింగే కారణం అంటూ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడి.. మరో 25, 30 పరుగులు అదనంగా చేసి ఉంటే.. మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. పైగా తమ సొంత గడ్డ అయిన చెన్నై పిచ్‌పై ఈ సీజన్‌లో అంతతంత మాత్రమే ప్రదర్శన చేస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో చిత్తుగా ఓడిపోవడం చెన్నై ఫ్యాన్స్‌కే రుచించడంలేదు. మరి ఈ మ్యాచ్‌లో రిజ్వీ, ధోని స్లో బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.