MS Dhoni: వీడియో: అందుకోసం.. ఒక్కసారైనా పాకిస్థాన్‌ వెళ్లి తీరాల్సిందే! ఫ్యాన్ కు ధోని సలహా!

MS Dhoni: వీడియో: అందుకోసం.. ఒక్కసారైనా పాకిస్థాన్‌ వెళ్లి తీరాల్సిందే! ఫ్యాన్ కు ధోని సలహా!

తాజాగా ఓ అభిమానికి ధోని ఇచ్చిన సలహా నెట్టింట వైరల్ గా మారింది. అందుకోసం మీరు ఒక్కసారైనా పాకిస్తాన్ వెళ్లాల్సిందే.. అంటూ సలహా ఇచ్చాడు మిస్టర్ కూల్.

తాజాగా ఓ అభిమానికి ధోని ఇచ్చిన సలహా నెట్టింట వైరల్ గా మారింది. అందుకోసం మీరు ఒక్కసారైనా పాకిస్తాన్ వెళ్లాల్సిందే.. అంటూ సలహా ఇచ్చాడు మిస్టర్ కూల్.

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరు ఒక బ్రాండ్. నరాలు తెగే మ్యాచ్ లో సైతం ఇసుమంతైనా.. టెన్షన్ పడకుండా ప్రత్యర్థి నుంచి గేమ్ ను లాగేసుకోవడంలో సిద్దహస్తుడు ధోని. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక తనకు ఇష్టమైన వ్యాపకాలతో రిలాక్స్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలకు హాజరవుతూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. ఇక తన లేటెస్ట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాడు. అయితే ధోని నోట ఏమాట వచ్చినా.. అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా ఓ అభిమానికి ధోని ఇచ్చిన సలహా నెట్టింట వైరల్ గా మారింది. అందుకోసం మీరు ఒక్కసారైనా పాకిస్తాన్ వెళ్లాల్సిందే.. అంటూ సలహా ఇచ్చాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. కెప్టెన్ గా, ఆటగాడిగా క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. కాగా.. తాజాగా ధోనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫుడ్ విషయంలో ఓ ఫ్యాన్ కు సలహా ఇచ్చాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? “మీకు మంచి ఫుడ్ కావాలంటే ఒకసారి పాకిస్తాన్ కి వెళ్లండి. అద్భుతంగా ఉంటుంది” అంటూ నవ్వుతూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈ మాటలు ధోని నిజంగా చెప్పాడా? లేక సరదాగా చెప్పాడా? అన్న విషయం తికమకపెడుతోంది. ఎందుకుంటే ఈ విషయాన్ని నవ్వుతూ చెప్పాడు. ఇక ధోని మోకాలి సర్జరీ తర్వాత ప్రాక్టీస్ మెుదలుపెట్టలేదు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు. లేటెస్ట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాడు. కాగా.. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ధోని ఇప్పటి వరకు డైరెక్ట్ గా స్పందించలేదు. మరి మంచి ఫుడ్ కావాలంటే పాకిస్తాన్ వెళ్లాల్సిందే అన్న ధోని సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments