iDreamPost
android-app
ios-app

బంగ్లాదేశ్‌ను దారుణంగా మోసం చేసిన ధోని! ఇప్పుడు నిజం బయటప్టెటాడు..

  • Published Nov 09, 2023 | 4:36 PM Updated Updated Nov 11, 2023 | 11:28 AM

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ధోని తాజాగా వెల్లడించాడు. ఆ వీడియో చూస్తే.. ఏంటి ధోనిలో ఇంత టాలెంట్‌ ఉందా? అని ఆశ్చర్యపోతారు. అసలు ఇంతకీ ధోనికి బంగ్లాదేశ్‌ క్రికెటర్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ధోని తాజాగా వెల్లడించాడు. ఆ వీడియో చూస్తే.. ఏంటి ధోనిలో ఇంత టాలెంట్‌ ఉందా? అని ఆశ్చర్యపోతారు. అసలు ఇంతకీ ధోనికి బంగ్లాదేశ్‌ క్రికెటర్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 09, 2023 | 4:36 PMUpdated Nov 11, 2023 | 11:28 AM
బంగ్లాదేశ్‌ను దారుణంగా మోసం చేసిన ధోని! ఇప్పుడు నిజం బయటప్టెటాడు..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఐసీసీ ‍ట్రోఫీలు భారత్‌కు అందించిన కెప్టెన్‌. 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీలను భారత జట్టు ధోని కెప్టెన్సీలోనే నెగ్గిన విషయం తెలిసిందే. కొన్ని ఏళ్ల పాటు టీమిండియాను తిరుగులేని శక్తిగా నడిపించిన అద్భుతమైన నాయకుడు ధోని. అందకే అతను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ఇండియన్‌ క్రికెట్‌ అభిమానుల హృదాయాల్లో ధోని గూడు కట్టుకుని ఉండిపోయాడు. ఇప్పటికీ ధోని ఏం చేసినా, ఏం మాట్లాడినా.. అది వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. సాధారణంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక లాంటి టీమ్స్‌తో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ఫీల్డ్‌లో భారత ఆటగాళ్లు ఎక్కువగా హిందీలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన ప్లాన్స్‌ వాళ్లకు అర్థం కాకూడదని, అలాగే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘాన్‌ లాంటి దేశాలతో మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటారు.. మన ప్లాన్స్‌ వాళ్లకు అర్థం కాకూడదని అలా చేస్తుంటారు. ఇలా భాష ఎంత కీలకమో ధోని చెబుతూ.. ఓ సారి బంగ్లాదేశ్‌లో ఆ జట్టుతో మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో బంగ్లా కీపర్‌, తమ బౌలర్‌కు ఏదో ప్లాన్‌ వివరిస్తున్నాడు. అది బెంగాలీ భాష. బంగ్లాలో ఎక్కువగా బెంగాలీనే మాట్లాడతారు.
బెంగాలీలో మాట్లాడుకుంటూ ధోనికి అర్థం కాదులే అనుకుని బంగ్లా వికెట్‌ కీపర్‌, బౌలర్‌తో తర్వాతి బాల్‌ ఎలా వేయాలో గట్టిగా అరుస్తూ చెబుతున్నాడు. అయితే.. ధోని మాత్రం ఏ బాల్‌ వేస్తున్న అద్భుతంగా ఆడుతున్నాడు. ఎందుకంటే తర్వాత ఎలాంటి బాల్‌ వేస్తాడో ధోనికి తెలిసిపోతుంది. ఎందుకంటే ధోనికి కూడా బెంగాలీ వచ్చు. టీమిండియాలోకి రాకపోముందు ధోని రైల్వేలో టీటీగా పనిచేశాడనే విషయం తెలిసిందే. ఆ ఉద్యోగంలో భాగంగా ధోని ఖరక్‌పూర్‌లో కొన్ని నెలలు పనిచేశాడు. ఆ సమయంలో ధోనికి బెంగాలీ వచ్చేసింది. అంత స్పష్టంగా మాట్లాడకపోయినా.. బెంగాలీని ధోని అర్థం చేసుకోగలడు.
అలా ధోనికి బెంగాలి వచ్చనే విషయం తెలియక.. బంగ్లా ఆటగాళ్లు ధోని చేతిలో మోసపోయారు. మ్యాచ్‌ తర్వాత వాళ్లు ధోనికి బెంగాలీ వచ్చి అనే విషయం మాట్లాడుకోవడం కూడా ధోని విన్నాడంటా.. ఆ విషయాన్ని ధోనినే స్వయంగా బెంగాలీలో వాళ్లు ఎలా మాట్లాడుకున్నారో చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే.. తనకు బెంగాలీ అర్థం అవుతుందనే విషయం పాపం బంగ్లా ఆటగాళ్లకు చెప్పకుండా వాళ్లు చిన్న చిన్న ప్లాన్‌ అన్ని ధోని ముందే తెలుసుకుని వాళ్లను మోసం చేశాడంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో సరదాగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.