IPLలో అత్యంత విలువైన టాప్‌-5 ఆటగాళ్లు వీళ్లే! లిస్ట్‌లో ఇద్దరు ఇండియన్స్‌

IPL 2024, Virat Kohli, Rohit Sharma, Sunil Narine: జోర్‌దార్‌గా సాగుతున్న ఐపీఎల్‌ 2024లో అదరగొడుతున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అయితే అందులో అత్యంత విలువైన టాప్‌ 5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2024, Virat Kohli, Rohit Sharma, Sunil Narine: జోర్‌దార్‌గా సాగుతున్న ఐపీఎల్‌ 2024లో అదరగొడుతున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అయితే అందులో అత్యంత విలువైన టాప్‌ 5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సూపర్‌గా జరుగుతోంది. క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే వినోదాన్ని, నరాలు తెగే ఉత్కంఠను అందిస్తూ.. ధనాధన్‌ క్రికెట్‌ మజాను ఇస్తోంది ఐపీఎల్‌. ఇప్పటికే దాదాపు అన్ని టీమ్స్‌ సగం కంటే ఎక్కువ మ్యాచ్‌లే ఆడేశాయి. ప్రతి జట్టు 8 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్‌లో అదరగొట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో టాప్‌ 5లో ఉన్న వాళ్లు ఎవరో పరిశీలిస్తే.. సూపర్‌ టాప్‌ 5 లిస్ట్‌ బయటికొచ్చిది. ఈ టాప్‌ 5 లిస్ట్‌ ఇద్దరు టీమిండియా స్టార్లు ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ఐపీఎల్‌ 2024లో మోస్ట్‌ వ్యాల్యూబుల్‌ టాప్‌ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

తమ ప్రదర్శన ఆధారంగా అత్యంత విలువైన ఆటగాళ్ల లిస్ట్‌ను ఐపీఎల్‌ అఫీషియల్‌ బ్రాడ్‌ కాస్ట్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా వెల్లడించింది. ఈ లిస్ట్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉన్నాడు. మొత్తం 242.5 పాయింట్లతో ఐపీఎల్‌ 2024లో అత్యంత విలువైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో నరైన్‌ 7 మ్యాచ్‌ల్లో 40.86 యావరేజ్‌తో 286 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 7.11గా ఉంది. ఇక ఈ లిస్ట్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 161.0 పాయింట్లతో కోహ్లీ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 63.17 సగటుతో 379 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ రెండు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. అలాగే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ కూడా కోహ్లీనే.

ఇక విరాట్‌ కోహ్లీ తర్వాత ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాళ్ల లిస్ట్‌లో మూడో స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఉన్నాడు. హెడ్‌ 160.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీకి, హెడ్‌కి కేవలం 0.5 తేడా మాత్రమే ఉంది. అయితే.. హెడ్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి 54 యావరేజ్‌తో 324 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో పంజాబ్‌ కింగ్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ సామ్‌ కరన్‌ ఉన్నాడు. ప్రస్తుతం పంజాబ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ గాయంతో ఉండటంతో కరన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

సామ్‌ కరన్‌ 147.5 పాయింట్లతో అత్యంత విలువైన ఆటగాళ్ల లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కరన్‌ బ్యాటింగ్‌లో 152 పరుగులు, బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ లిస్ట్‌లో లాస్ట్‌ బట్‌ నాట్‌ ద లీస్ట్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. 145.5 పాయింట్లతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మోస్ట్‌ వ్యాల్యూబుల్‌ ప్లేయర్ల లిస్ట్‌లో టాప్‌ 5లో నిలిచాడు రోహిత్‌ శర్మ. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ.. 43.29 యావరేజ్‌తో 303 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది. మరి మోస్ట్‌ వ్యాల్యూబుల్‌ ప్లేయర్స్‌ ఆఫ్‌ ఐపీఎల్‌ 2024 టాప్‌ 5 లిస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments