టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో వేస్ట్‌ అన్నారు.. కట్‌ చేస్తే అతనే హీరో అయ్యాడు!

టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో వేస్ట్‌ అన్నారు.. కట్‌ చేస్తే అతనే హీరో అయ్యాడు!

T20 World Cup 2024, Hardik Pandya, IND vs SA: టీ20 వరల్డ్‌ కప్‌ ముందు ప్రపంచ క్రికెట్‌లో ఏ ఆటగాడు కూడా అంత దారుణంగా ట్రోలింగ్‌కి గురి కాలేదు..కానీ, అదే ఆటగాడు ఇప్పుడు టీమిండియాకు హీరోగా మారాడు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

T20 World Cup 2024, Hardik Pandya, IND vs SA: టీ20 వరల్డ్‌ కప్‌ ముందు ప్రపంచ క్రికెట్‌లో ఏ ఆటగాడు కూడా అంత దారుణంగా ట్రోలింగ్‌కి గురి కాలేదు..కానీ, అదే ఆటగాడు ఇప్పుడు టీమిండియాకు హీరోగా మారాడు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆరంభానికి ముందు అంటే.. ఐపీఎల్‌ 2024 చివరి దశలో ఉన్న సమయంలో భారత సెలెక్టర్లు వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటించింది. 15 మందితో కూడిన స్క్వౌడ్‌లో ఓ ఆటగాడి పేరును చూసి.. భారత క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. అసలు అతను టీమ్‌లో ఎందుకు వేస్తూ.. అంటూ దారుణంగా తిట్టిపోశారు. అతని కంటే ఒక కొత్త ప్లేయర్‌కు అవకాశం ఇస్తే మంచిదని, ఇతను టీమ్‌లో ఉంటే ఇక కప్పు గెలిచినట్టే అంటూ విమర్శించారు. కానీ, కట్‌ చేస్తే.. అతనే టీమిండియా హీరో అయ్యాడు. దిగ్గజ క్రికెటర్లు విఫలమైన చోటు కూడా అతను బ్యాట్‌తో, బాల్‌తో రాణించి.. టీమిండియాకు వజ్రాయుధంగా మారి.. వరల్డ్‌ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోసించాడు.

సౌతాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు అవసరమైన సమయంలో బౌలింగ్‌కు వచ్చి తొలి బంతికే డేంజరస్‌ క్లాసెన్‌ను అవుట్‌ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత చివరి ఓవర్‌లో 16 పరుగులు డిఫెండ్‌ చేయాల్సిన సమయంలో తొలి బంతికే మిల్లర్‌ను అవుట్‌ చేసి.. మ్యాచ్‌ను మన చేతుల్లో పెట్టాడు. చివరి ఓవర్‌లో కేవలం 8 రన్స్‌ ఇచ్చి.. టీమిండియాకు విజయం అందించాడు. అతనెవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్‌.. అతనే హార్ధిక్‌ పాండ్యా.

ఐపీఎల్‌ 2024 ‍కంటే ముందు నుంచి హార్ధిక్‌ పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్‌ జరిగింది. గుజరాత్‌ టైటాన్స​ నుంచి ముంబై ఇండియన్స్‌కి మారడంతో పాటు.. రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించడంతో పాండ్యాపై విమర్శలు మొదలయ్యాయి. అలాగే ఐపీఎల్‌ 2024 ప్రారంభం అయిన తర్వాత ముంబై ఫస్ట్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కి పంపడంతో పాండ్యాపై క్రికెట్‌ అభిమానులకు కోపం మరింత పెరిగిపోయింది.

దీంతో.. పాండ్యా గ్రౌండ్‌లో కనిపిస్తే చాలు.. బో అంటూ గోల చేయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఓ భారత క్రికెటర్‌.. సొంత దేశ అభిమానుల నుంచి ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొవడం తాము ఎప్పుడూ చూడలేదంటూ విదేశీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోయారు. కోహ్లీ సైతం పాండ్యాను అలా ట్రోల్‌ చేయొద్దని ప్రేక్షకులను కోరాడు. అయినా కూడా పాండ్యాను దారుణంగా ట్రోల్‌ చేశారు. గ్రౌండ్‌లోకి కుక్క వస్తే హార్ధిక్‌ హార్ధిక్‌ అంటూ అరిచారు. దానికి తోడు ఐపీఎల్‌ 2024లో పాండ్యా సరైన ఫామ్‌లో లేకపోవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత అతని వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటికి వచ్చాయి. ఇవన్నీ మౌనంగా, చిరునవ్వుతో భరించిన పాండ్యా.. దేశానికి వరల్డ్‌ కప్‌ గెలిపించి.. తనను తిట్టిన వారితోనే ప్రశంసలు పొందుతున్నాడు. ఇది చూసిన క్రికెట్‌ నిపుణులు ఇది కదా కమ్‌బ్యాక్‌ అంటే అంటూ పాండ్యాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొన్ని నెలల క్రితం తనపై జరిగిన ట్రోలింగ్‌ను తాజాగా ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత గుర్తుచేసుకున్న పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments