iDreamPost
android-app
ios-app

క్రికెట్‌ చరిత్రలోనే విచిత్రమైన సంఘటన! అంపైర్ల నిర్ణయంతో అంతా షాక్‌

  • Published Dec 11, 2023 | 9:11 AM Updated Updated Dec 11, 2023 | 11:42 AM

Western District, Ginninderra: క్రికెట్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ విచిత్రమైన ఘటనపై అంపైర్లు తీసుకున్న నిర్ణయం తెలుసుకుంటే మీరు కూడా షాక్‌ అవుతారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Western District, Ginninderra: క్రికెట్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ విచిత్రమైన ఘటనపై అంపైర్లు తీసుకున్న నిర్ణయం తెలుసుకుంటే మీరు కూడా షాక్‌ అవుతారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 11, 2023 | 9:11 AMUpdated Dec 11, 2023 | 11:42 AM
క్రికెట్‌ చరిత్రలోనే విచిత్రమైన సంఘటన! అంపైర్ల నిర్ణయంతో అంతా షాక్‌

క్రికెట్‌ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అంపైర్లకు తలలు బద్దలయ్యేలా చేసింది. అదేంటంటే.. బౌలర్‌ వేసిన బాల్‌ నేరుగా వెళ్లి మిడిల్‌ స్టంప్‌ కు తగిలింది. దాంతో మధ్య వికెట్‌ పూర్తిగా వెనక్కి జరిగింది. ఎవరైనా దాన్ని క్లియర్‌ గా అవుట్‌ అనే అనుకుంటారు. పాపం బ్యాటర్‌ కూడా తాను అవుట్‌ అయ్యాను అనుకుని పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ, ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అవుట్ అనుకుని వెళ్ళిపోతున్న బ్యాటర్ ని వెనక్కి పిలిచి మరీ ఆడు అంటూ అంపైర్లు బుర్ర పాడు చేసేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా? రీడ్ ఓవల్‌ లో శనివారం మధ్యాహ్నం వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ – గిన్నిండెరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

గిన్నిండెరా బౌలర్ ఆండీ రెనాల్డ్స్ వేసిన బౌలింగ్‌ లో వెస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ మాథ్యూ బోసుస్టోను క్లీన్ బౌల్ అయ్యాడు. బంతి వెళ్లి మిడిల్‌ స్టంప్‌ ను క్లియర్‌ గా హిట్‌ చేసింది. కానీ, స్టంప్స్‌ పై ఉండే బెయిల్స్‌ మాత్రం కిందపడలేదు. దీంతో.. బ్యాటర్‌ అవుట్‌ అనుకుని పెవిలియన్‌ కు వెళ్తున్నా.. అంపైర్లు ఏదో చర్చించి అతన్ని వెనక్కి పిలిపించారు. కచ్చితంగా రెండు బెయిల్స్‌ లో ఒక్క బెయిల్‌ అయినా కింద పడాల్సిందే అని.. అలా జరగకపోతే.. బ్యాటర్‌ నాటౌట్‌ అని క్రికెట్‌ రూల్స్‌ చెబుతున్నాయ్‌ అంటూ.. బ్యాటర్‌ ను నాటౌట్‌ గా ప్రకటించారు. అంపైర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరు జట్ల క్రికెటర్లు షాక్‌ అయ్యారు. నిజానికి క్రికెట్‌ లో చాలా సార్లు బాల్‌ స్టంప్స్‌ ను తాకి వెళ్తున్నట్లు, లైట్లు వెలిగినట్లు రీప్లేలో క్లియర్‌ గా తెలిసినా.. బెయిల్స్‌ పడలేదని అవుట్‌ ఇచ్చేవారు కాదు. కానీ, ఇక్కడ మాత్రం మిడిల్‌ స్టంప్‌ క్లియర్‌ గా వెనక్కి వెళ్లినా.. బెయిల్స్‌ అలాగే ఉండిపోవడంతో అంపైర్లు నాటౌట్‌ గా ప్రకటించారు.

అయితే.. అసలు మధ్య వికెట్‌ లేకపోయినా ఆ బెయిల్స్‌ అలా ఎలా ఉండిపోయాయని క్రికెట్‌ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్లియర్‌ గా సైన్స్‌ అని కొంతమంది.. లేదు బెయిల్స్‌ మధ్య ఎవరో చూయింగ్‌ గమ్‌ పెట్టి ఉంటారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా.. మొత్తానికి క్రికెట్‌ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇదే ఘటన ఓ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ లో జరిగి ఉంటే తీవ్ర చర్చకు దారితీసి.. ఐసీసీ రూల్స్‌ మార్చే వరకు వెళ్లేది పరిస్థితి. మరి బాల్‌ వికెట్లకు తగిలినా కూడా రూల్స్‌ ప్రకారం అంపైర్లు నాటౌట్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.