SNP
Gautam Gambhir, BCCI: భారత కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సరైనోడిని దింపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ కొత్త బౌలింగ్ కోచ్‌గా వినిపిస్తున్న పేరు ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, BCCI: భారత కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సరైనోడిని దింపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ కొత్త బౌలింగ్ కోచ్‌గా వినిపిస్తున్న పేరు ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన గౌతమ్ గంభీర్ త్వరలోనే బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నెల 26 నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌తోనే గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే.. తనతో పాటు తన కో స్టాఫ్.. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌తో పాటు బ్యాక్ రూమ్ స్టాఫ్‌ను నియమించుకునేందుకు గంభీర్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే బౌలింగ్ కోచ్‌గా ఒక దిగ్గజ క్రికెటర్‌ను బరిలోకి దింపేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడు.
అసిస్టెంట్ కోచ్‌ల ఎంపిక విషయంలో గంభీర్‌కు కాస్త ఎక్కువ ప్రియారిటీ ఇస్తోంది బీసీసీఐ. హెడ్ కోచ్‌గా ఉండాలని బీసీసీఐ కోరినప్పుడే గంభీర్ కొన్ని కండీషన్లు పెట్టాడు. అందులో అసిస్టెంట్ కోచ్‌ల ఎంపిక కూడా తనకు నచ్చినట్లు ఉండాలనేది ఒక కండీషన్. దానిలో భాగంగా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ మోర్నే మోర్కెల్‌ను తీసుకోవాలని గంభీర్.. బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. అదే జరిగితే.. టీమిండియాకు ఒక బెస్ట్ బౌలింగ్ కోచ్ దొరికినట్లే లెక్క. అయితే.. మోర్కెల్ కంటే ముందు.. పలు పేర్లు కూడా వినిపించాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ను భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నారనే వార్త కూడా బాగా ప్రచారంలో ఉంది. ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికే జహీర్ ఖాన్‌ను సంప్రదించినట్లు కథనాలు వచ్చాయి. అలాగే భారత మాజీ క్రికెటర్లు లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్‌ల పేర్లు కూడా బలంగా వినిపించాయి. కానీ, ఇప్పుడు సడెన్‌గా మోర్కెల్ పేరు బయటికి వచ్చింది. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటర్‌గా వ్యవహరించిన సమయంలో మోర్కెల్ ఆ టీమ్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో మోర్కెల్ పనితన చూసిన గంభీర్.. ఇప్పుడు తన కోచింగ్ స్టాఫ్‌లో మోర్కెల్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మోర్కెల్ టీమిండియా బౌలింగ్ కోచ్‌గా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
GAMBHIR WANTS MORNE MORKEL AS TEAN INDIA’S BOWLING COACH…!!! – BCCI yet to take a final call#GautamGambhir #mornemorkel #BCCI pic.twitter.com/F6oUSzyuoh
— Sayyad Nag Pasha (@nag_pasha) July 12, 2024