iDreamPost
android-app
ios-app

Monitor Lizard: గ్రౌండ్‌లోకి వింతజీవి! ఏకంగా మ్యాచ్‌నే ఆపేశారు!

  • Published Feb 03, 2024 | 4:36 PM Updated Updated Feb 03, 2024 | 4:36 PM

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి కుక్కలు, పక్షులు రావడం సహజం. కానీ, శ్రీలంక-ఆఫ్గాన్‌ జట్ల మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ వింత జీవి గ్రౌండ్‌లోకి వచ్చింది. దాంతో మ్యాచ్‌ ఆపేశారు. ఆ జీవి ఏంటి? ఎలా వచ్చింది? ఎలా వెళ్లింది? ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి కుక్కలు, పక్షులు రావడం సహజం. కానీ, శ్రీలంక-ఆఫ్గాన్‌ జట్ల మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ వింత జీవి గ్రౌండ్‌లోకి వచ్చింది. దాంతో మ్యాచ్‌ ఆపేశారు. ఆ జీవి ఏంటి? ఎలా వచ్చింది? ఎలా వెళ్లింది? ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 03, 2024 | 4:36 PMUpdated Feb 03, 2024 | 4:36 PM
Monitor Lizard: గ్రౌండ్‌లోకి వింతజీవి! ఏకంగా మ్యాచ్‌నే ఆపేశారు!

ఒకవైపు సిరీస్‌గా మ్యాచ్‌ జరుగుతున్న కమ్రంలో.. ఒక వింత జీవి గ్రౌండ్‌లోకి వచ్చింది. దాంతో అంపైర్లు కాసేపు మ్యాచ్‌ను ఆపేశారు. సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో గ్రౌండ్‌లోకి కుక్కలు, పక్షులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సార్లు పాములు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా కొలంబో వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఒక వింత జీవి ప్రత్యేక్షమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను కొద్ది సేపు నిలిపేశారు. దాన్ని గ్రౌండ్‌ నుంచి బయటికి తరిమేందుకు వెళ్లిన వారిపై ఎగబడుతూ వచ్చింది. దీంతో వాళ్లంతా భయపడి వెనక్కి జరిగారు.

ఈ సంఘటన శ్రీలంక బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చోటు చేసుకుంది. ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌ మూడో బంతి వేస్తున్న సమయంలో బౌండరీ లైన్‌ వద్ద మోనిటోర్‌ లిచార్డ్‌ వచ్చింది. దాన్ని చూసి అంతా హడలిపోయారు. అసలు అది గ్రౌండ్‌లోకి ఎలా వచ్చిందో కూడా చాలా మందికి అర్థం కాలేదు. దాన్ని పట్టుకుని బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన సిబ్బందిపైకి దూసుకొచ్చింది. అయితే.. కొద్ది సేపటి తర్వాత అదే గ్రౌండ్‌ నుంచి వెళ్లిపోయింది. కానీ, కొద్ద సేపు అక్కడున్న వారందరిని భయపెట్టింది. గ్రౌండ్‌లో ఉండే ఆటగాళ్లు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అయోమయానికి గురయ్యారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే ఆలౌట్‌ అయింది. రహమత్‌ ఒక్కడే 91 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆఫ్ఘాన్‌ తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయింది. శ్రీలంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4, అసిత్‌ ఫెర్నాండో 3, జయసూర్య 3 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి.. భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. యాంజిలో మ్యాథ్యూస్‌ సెంచరీ చేశాడు. 101 పరుగులతో ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నాడు. అలాగే డినేష్‌ చండీమల్‌ 90 పరుగులతో ఆడుతున్నాడు. మరి జరుగుతున్న సమయంలో ఈ వింత జీవి వచ్చి.. మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Sri Lanka vs Afghanistan Test was delayed for sometime due to &quot;Monitor Lizard&quot;.<a href=”https://t.co/rbRAVoza1p”>pic.twitter.com/rbRAVoza1p</a></p>&mdash; Johns. (@CricCrazyJohns) <a href=”https://twitter.com/CricCrazyJohns/status/1753706688081998137?ref_src=twsrc%5Etfw”>February 3, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>