T20 World Cup: పాకిస్థాన్‌ను చెప్పి మరీ ఓడించాడు! ఇది భారతీయుడి దెబ్బ!

టీ20 ప్రపంచకప్ లో గురువారం నాడు అమెరికా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు యూఎస్ కెప్టెన్ మోనాంక్ పటేల్ పాక్ ను చెప్పి మరీ ఓడించి జట్టుకు విజయాన్నందించాడు.

టీ20 ప్రపంచకప్ లో గురువారం నాడు అమెరికా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు యూఎస్ కెప్టెన్ మోనాంక్ పటేల్ పాక్ ను చెప్పి మరీ ఓడించి జట్టుకు విజయాన్నందించాడు.

క్రికెట్ లో ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి. మ్యాచ్ కు ముందు ప్రత్యర్థి జట్లను ఉద్దేశించి క్రికెటర్లు చేసే కామెంట్లు నిజమవుతుంటాయి. తాజాగా ఇదే నిజమయ్యింది. అమెరికాలో టీ 20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొన్న జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో సంచలన విజయం నమోదైంది. అమెరికా, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్లో పాక్ ను చిత్తు చేసి సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది యూఎస్ఏ. అయితే ఈ విజయాన్ని ముందుగానే ఊహించాడు అమెరికా జట్టు కెప్టెన్ మోనాంక్‌ పటేల్‌. పాకిస్థాన్ ను చెప్పి మరీ ఓడించాడు.

యూఎస్ఏ జట్టు కెప్టెన్ మోనాంక్‌ పటేల్ మ్యాచ్ కు ముందు చేసిన వ్యాఖ్యలు నిజం చేసి చూపించాడు. పాక్ ను ఓడించేందుకు తమకు అరగంట చాలని మ్యాచ్‌కు ముందు కామెంట్స్ చేసిన మోనాంక్‌ అదే చేసి చూపించాడు. తమకు లక్ తో వచ్చిన గెలుపు కాదని మెరుగైన ప్రదర్శతోనే పాక్ ను చిత్తుగా ఓడించామని మోనాంక్ తెలిపాడు. మ్యాచ్ కు ముందే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో 30-40 నిమిషాలు మేం మంచి ప్రదర్శన చేస్తే చాలు విజయం మాదే అని మోనాన్క్ పటేల్ అన్నాడు. ఆ మాటలు అనడమే కాదు చెప్పి మరీ పాక్ ను ఓడించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ మొదటి అరగంటలో మ్యాచ్‌పై పట్టు సాధించింది. పాక్ హిట్లర్లైన ఓపెనర్‌ మహ్మద్ రిజ్వాన్ (9), ఉస్మాన్ ఖాన్ (3), ఫఖర్ జమాన్ (11)లను కొంత సమయానికే యూఎస్ బౌలర్లు పెవిలియన్ చేర్చారు. దాంతో పాక్ భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది.

కాగా ఈ మ్యాచ్ లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. అయితే చివరి ఓవర్‌లో అమెరికా విక్టరీకి 15 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4 సింగిల్స్‌, ఓ సిక్స్‌ వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్‌ నష్టానికి 18 పరుగులు చేసింది. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్‌ వికెట్ నష్టపోయి 13 పరుగులకు పరిమితమై అమెరికా చేతిలో ఓడిపోయింది.

Show comments