iDreamPost
android-app
ios-app

Mohammed Siraj: సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్.. పోటెత్తిన అభిమానులు! వీడియో వైరల్..

  • Published Jul 06, 2024 | 8:24 AM Updated Updated Jul 06, 2024 | 8:24 AM

వరల్డ్ కప్ విన్నింగ్ హీరో, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుని రోడ్ షోలో పాల్గొన్న సిరాజ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

వరల్డ్ కప్ విన్నింగ్ హీరో, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుని రోడ్ షోలో పాల్గొన్న సిరాజ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

  • Published Jul 06, 2024 | 8:24 AMUpdated Jul 06, 2024 | 8:24 AM
Mohammed Siraj: సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్.. పోటెత్తిన అభిమానులు! వీడియో వైరల్..

ముంబైలో విక్టరీ పరేడ్ ను ముగించుకున్న అనంతరం శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాడు వరల్డ్ కప్ విన్నింగ్ హీరో, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన సిరాజ్ కు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. వరల్డ్ కప్ హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. రోడ్ షోకు భారీగా తరలివచ్చిన అభిమానులు కేరింతలు కొడుతూ.. అడుగడుగునా నీరాజనం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీ, సన్మాన కార్యక్రమం తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్. విమానాశ్రయంలో దిగిన సిరాజ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు అభిమానులు. ఇక ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ..”ఇది హైదరాబాద్ గర్వించదగ్గ అద్భుతమైన క్షణాలు. వరల్డ్ కప్ గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది వర్ణించడానికి మాటలు రావడంలేదు. భవిష్యత్ లో మరిన్ని ట్రోఫీలు సాధించడానికి కృషి చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.

అనంతరం రోడ్ షోలో పాల్గొన్నాడు. మెహదీపట్నం సరోజినిదేవి కంటి ఆసుపత్రి నుంచి ప్రారంభమై.. ఈద్గా మైదానం వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నాడు సిరాజ్. తమ అభిమాన క్రికెటర్, వరల్డ్ కప్ విన్నర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ.. ముందుకు సాగాడు సిరాజ్. అభిమానులు సిరాజ్ ను తమ సెల్ ఫోన్స్ లో బంధించుకున్నారు. సిరాజ్.. సిరాజ్.. నామస్మరణతో రోడ్ షో మెుత్తం దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgray girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom