SNP
Mohammed Siraj, IND vs IRE, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023లో ఫాలో పాటించిన సంప్రదాయాన్ని ఇందులో కూడా కొనసాగిస్తోంది. ఈ సంప్రదాయంలో భాగంగా సిరాజ్ బోణి కొట్టాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mohammed Siraj, IND vs IRE, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023లో ఫాలో పాటించిన సంప్రదాయాన్ని ఇందులో కూడా కొనసాగిస్తోంది. ఈ సంప్రదాయంలో భాగంగా సిరాజ్ బోణి కొట్టాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇండియా ఓటమిని సగటు క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే.. అదే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ది బెస్ట్ వరల్డ్ కప్ టోర్నీగా కూడా నిలిచింది. ఎందుకంటే.. ఒక్క ఓటమి కూడా లేకుండా రోహిత్ సేన ఫైనల్ వరకు దూసుకెళ్లింది. 1983, 2011 వన్డే వరల్డ్ కప్పులు టీమిండియా సాధించినా.. ఓటమి లేకుండా అయితే ఫైనల్‌కు చేరలేదు. కానీ, ఒక్క 2023 వన్డే వరల్డ్ కప్‌లోనే వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. ఎదురొచ్చిన ప్రతి టీమ్‌ను ఓడిస్తూ.. ఫైనల్ వరకు దూసుకెళ్లింది.
ఆ వరల్డ్ కప్ టోర్నీ జట్టులోని ప్రతి ఆటగాడు అద్భుతమైన ఫామ్‌లో ఉండి టీమిండియా కోసం ప్రాణం పెట్టి ఆడారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, బుమ్రా, షమీ, సిరాజ్, జడేజా, కుల్దీప్ యాదవ్ ఇలా ప్రతి ఒక్కరు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. అయితే.. ప్రతి మ్యాచ్‌లోనూ టీమ్‌ను ఉత్సాహపర్చడానికి టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ ఒక వినూత్న ఆలోచన చేసింది. అదేంటంటే.. ప్రతి మ్యాచ్‌లో మంచి ఫీల్డింగ్ చేసిన ఓ ప్లేయర్‌ను మ్యాచ్ తర్వాత మెడల్‌తో సత్కరించింది. ఈ మెడల్ అందజేయడం అనేది ఆ వరల్డ్ కప్ టోర్నీలో హైలెట్‌గా మారింది.
మ్యాచ్ మ్యాచ్‌కు ఏ ప్లేయర్ బెస్ట్ ఫీల్డర్ మెడల్ తీసుకుంటాడా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. పైగా ఇచ్చిన ప్రతిసారి వినూత్నంగా బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను ఇవ్వడం, పేరు ప్రకటించడం లాంటివి చేయడంతో ఆటగాళ్లలో ఉత్సాహం పెరిగింది. ఇది టీమ్‌లో ఒక కొత్త జోష్‌ను నింపింది. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా టీమిండియా కొనసాగిస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును సిరాజ్‌కు అందజేశారు. ఇది కూడా కొత్త పద్దతిలో ప్రకటించారు. ఒక కుర్రాడు సిరాజ్‌కు ఈ మెడల్ అందించాడు. ఇవన్నీ చూస్తుంటే.. మళ్లీ టీమిండియాలో వన్డే వరల్డ్ కప్ 2023 వైబ్స్ వచ్చినట్లు కనిపిస్తున్నాయి. కానీ, ఒక్క ఫైనల్ మాత్రం అలా జరగొద్దని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ మెడల్ సంప్రదాయంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
THE BEST FIELDER MEDAL IS BACK! 🎖️
– A little fan handed over the medal to Mohammad Siraj. 🥹❤️ pic.twitter.com/7fFNnHbsXN
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2024