IND vs PAK: టీమిండియా గెలుపులో బుమ్రా, పంత్‌తో పాటు మరో హీరో ఉన్నాడు!

IND vs PAK: టీమిండియా గెలుపులో బుమ్రా, పంత్‌తో పాటు మరో హీరో ఉన్నాడు!

Mohammed Siraj, IND vs PAK, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాక్‌పై టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ విజయంలో బుమ్రా, పంత్‌తో పాటు మరో స్టార్‌కు ‍క్రెడిట్‌ ఇవ్వాలి. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

Mohammed Siraj, IND vs PAK, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాక్‌పై టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ విజయంలో బుమ్రా, పంత్‌తో పాటు మరో స్టార్‌కు ‍క్రెడిట్‌ ఇవ్వాలి. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇండియా-పాకిస్థాన్‌ ముగిసింది. అసలు సిసలైన క్రికెట్‌ మజాను పంచుతూ.. లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌గా సాగింది ఈ దాయాది పోరు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోన నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది. అయినా కూడా మ్యాచ్‌ పూర్తి ఓవర్లు జరిగింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 19 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ స్వల్ప టార్గెట్‌ను కూడా టీమిండియా బౌలర్లు అద్భుత బౌలింగ్‌ డిఫెండ్‌ చేసుకున్నారు.

పాక్‌పై టీమిండియా సాధించిన విజయానికి జస్ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌ కారణం అంటున్నారు. అది నిజమే కానీ, వారితో పాటు మరో హీరో కూడా ఉన్నాడు. 119 పరుగుల చిన్న టార్గెట్‌ను డిఫెండ్‌ చేసే సమయంలో 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. అలాగే పంత్‌ 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జట్టులోని మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన సమయంలో పంత్‌ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే.. బుమ్రా, పంత్‌తో పాటు సిరాజ్‌ కష్టాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.

బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సిరాజ్‌ టీమిండియాకు అవసరమైన సాయం అందించాడు. హేమాహేమీ బ్యాటర్లు అవుటైన చోట.. సిరాజ్‌ 7 బంతుల్లో విలువైన 7 పరుగులను టీమిండియా స్కోర్‌ బోర్డుకు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 6 పరుగుల తేడాతోనే గెలిచిన విషయం తెలిసిందే. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. బుమ్రా తర్వాత అత్యుత్తమ ఎకానమీతో సిరాజ్‌ బౌలింగ్‌ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చాడు. ఇది పాక్‌పై తీవ్ర ఒత్తిడి పెంచింది. వికెట్లు తీయకపోయినా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు సిరాజ్‌. మరి పాక్‌పై విజయంలో సిరాజ్‌ అన్‌సంగ్‌ హీరోగా ఉన్న సిరాజ్‌ పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments