iDreamPost
android-app
ios-app

మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. పోస్ట్ వైరల్!

  • Author Soma Sekhar Updated - 09:05 AM, Thu - 21 September 23
  • Author Soma Sekhar Updated - 09:05 AM, Thu - 21 September 23
మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. పోస్ట్ వైరల్!

మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు ఈ హైదరాబాదీ స్పీడ్ గన్. దీంతో తాజాగా ఐసీసీ విడుదల చేసిన అంతర్జాతీయ వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్ లో 694 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు 9వ స్థానంలో ఉన్నాడు సిరాజ్. కాగా లంకతో జరిగిన మ్యాచ్ లో సంచలన బౌలింగ్ చేసి.. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే తీవ్ర భావోద్వేగానికి లోనైన సిరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహ్మద్ సిరాజ్.. కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి.. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇటీవల జరిగి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాటర్లను వణికిస్తూ.. కేవలం 21 పరుగులకే 6 వికెట్లు తీసి సంచలనం నమోదు చేశాడు. దీంతో ఈ సంవత్సరం జనవరిలో నంబర్ వన్ గా నిలిచిన అతను.. మళ్లీ తన అగ్రస్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యాడు సిరాజ్. తన కెరీర్ లో అత్యున్నత దశను చూడకుండానే తన తండ్రి చనిపోవడంతో ఎమోషనల్ అయ్యాడు. కొంత కాలం క్రితం చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. తనను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్న ఫొటోను వారిద్దరు చూస్తూ ఎంతో సంతోష పడుతున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ పిక్ కు ‘మిస్ యూ పప్పా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Siraj emotional post about his father

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş