ఐసీసీ రీసెంట్గా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. అయితే వారంలోపే టాప్ ప్లేస్‌ను కోల్పోయాడు సిరాజ్.
ఐసీసీ రీసెంట్గా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. అయితే వారంలోపే టాప్ ప్లేస్‌ను కోల్పోయాడు సిరాజ్.
క్రికెట్లో ర్యాంకులకు ఉండే ఇంపార్టెన్స్ గురించి తెలిసిందే. కంటిన్యూస్‌గా బాగా పెర్ఫార్మ్ చేసే ప్లేయర్లే ర్యాంకుల్లో ముందుంటారు. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ నిరంతరం రాణించే ఆటగాళ్లకు ర్యాంకులు కాన్ఫిడెన్స్‌ను మరింతగా పెంచుతాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించే ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ హవా నడుస్తోంది. తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (832 పాయింట్లు) ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (824)ను వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు గిల్. భారత్ తరఫున పిన్న వయసులో నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న బ్యాట్స్‌మన్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇప్పుడు దీన్ని గిల్ బ్రేక్ చేశాడు.
లెజెండరీ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత వన్డేల్లో నంబర్ వన్‌గా నిలిచిన భారత బ్యాటర్‌గా నిలిచాడు గిల్. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ (772) నాలుగో ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (760) ఉన్నాడు. ఇటీవల ప్రకటించిన బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేసులోకి దూసుకొచ్చిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (723) రెండో స్థానానికి పడిపోయాడు. భారత మూలాలు ఉన్న సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (726) అగ్రస్థానానికి చేరుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (687), కుల్దీప్ యాదవ్ (682) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు.
సిరాజ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించి వారం కూడా గడవలేదు. అప్పుడే ఆ ర్యాంక్‌ను కోల్పోయాడు. దీనికి కారణం అగ్రస్థానంలోకి వచ్చిన సఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ మిగిలిన మ్యాచుల్లో రాణించడమేనని చెప్పొచ్చు. అయితే సిరాజ్ టాప్ ప్లేస్‌ను కోల్పోయినా ఆ స్థానంలోకి భారతీయ మూలాలు ఉన్న కేశవ్ రావడంతో ఇండియన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. సిరాజ్ పోయినా టాప్ చెయిర్ మనోడికే దక్కిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ సెమీస్‌లో సౌతాఫ్రికా, భారత్‌లు ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్‌లో నెగ్గితే ఫైనల్‌కు కూడా చేరుకునే ఛాన్స్ ఉన్నందున టోర్నమెంట్ ముగిసేలోపు నంబర్ వన్ ర్యాంక్ కోసం సిరాజ్-కేశవ్ మధ్య పోటీ ఇలాగే జరిగేలా కనిపిస్తోంది. మరి.. సిరాజ్ టాప్ ర్యాంక్ కోల్పోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భారత్- న్యూజిలాండ్ మ్యాచ్.. ముంబై వాంఖడే స్టేడియానికి బెదిరింపులు!
How the @MRFWorldwide ICC Men’s ODI Player Rankings stack up ahead of #CWC23 knockouts 👀
✍️: https://t.co/fgDGzPPoev pic.twitter.com/zlTztt68R2
— ICC (@ICC) November 14, 2023