వీడియో: పంజాబ్‌ ఆలౌట్‌ తర్వాత.. సిరాజ్‌ చేసిన దానికి అర్థం ఏంటి?

Mohammed Siraj, RCB vs PBKS, IPL 2024: ఈ సీజన్‌ ఆరంభంలో అంత గొప్ప ఫామ్‌లో లేని సిరాజ్‌ మెల్లమెల్లగా తన లయను అందుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి.. సిరాజ్‌ చేసిన యాక్షన్‌ వైరల్‌గా మారింది. మరి దానికి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Mohammed Siraj, RCB vs PBKS, IPL 2024: ఈ సీజన్‌ ఆరంభంలో అంత గొప్ప ఫామ్‌లో లేని సిరాజ్‌ మెల్లమెల్లగా తన లయను అందుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి.. సిరాజ్‌ చేసిన యాక్షన్‌ వైరల్‌గా మారింది. మరి దానికి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బంపర్‌ విక్టరీ కొట్టింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ చేతులెత్తేసింది. ఆర్సీబీ మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, కామెరున్‌ గ్రీన్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో భారీ స్కోర్‌ చేసిన ఆర్సీబీ.. పంజాబ్‌ను 181 పరుగులకే కట్టడి చేసి.. ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని, వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటిన సిరాజ్‌.. పంజాబ్‌ ఆలౌట్‌ అయిన తర్వాత ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అసలు సిరాజ్‌ అలా ఎందుకు అన్నాడని క్రికెట్‌ అభిమానులు ఆలోచిస్తున్నారు.

పంజాబ్‌ చివరి వికెట్‌గా అర్షదీప్‌ సింగ్‌ అవుట్‌ అయ్యాడు. మొహమ్మద్‌ సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బాల్‌కు కరణ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ వికెట్‌తో పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 242 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్‌ అయింది. అర్షదీప్‌ సింగ్‌ను అవుట్‌ చేసి.. మూడో వికెట్‌ సాధించిన తర్వాత.. నేను ఇక్కడ ఉన్న టెన్షన్‌ పడకండి అన్నట్లు సిరాజ్‌ సైగలు చేశాడు. సిరాజ్‌ చేసిన ఈ యాక్షన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్‌.. చివర్లో మూడు వికెట్లు తీసి.. ఇలా ఎందుకు రియాక్ట్‌ అయ్యాడు.. అసలు సిరాజ్‌ చేసిన దానికి అర్థమేంటి అని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే.. ఈ సీజన్‌ ఆరంభంలో సిరాజ్‌ పెద్దగా రాణించలేదు. భారీగా పరుగులు సమర్పించుకుని.. వికెట్లు కూడా పడగొట్టలేకపోయాడు. దాంతో సిరాజ్‌ను ఒక మ్యాచ్‌లో పక్కన కూడా పెట్టాల్సి వచ్చింది. కానీ, గతకొన్ని మ్యాచ్‌ల్లో సిరాజ్‌ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల ప్రకటించిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టీమ్‌లో సిరాజ్‌కు కూడా చోట దక్కింది. సిరాజ్‌ సెలెక్షన్‌పై విమర్శలు వచ్చాయి. ఏ మాత్రం ఫామ్‌లో లేని సిరాజ్‌ను ఎందుకు ఎంపిక చేశారంటూ కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ విమర్శలకు తన ప్రదర్శనతో సమాధానం చెబుతున్నాడు సిరాజ్‌. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి తన పాత ఫామ్‌ను అందుకుంటూ.. వికెట్లు పడగొడుతూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన విమర్శలకు.. సిరాజ్‌ ఈ విధంగా.. కంగారు పడకండి నేను ఉంటాను అన్నట్లు ఇలా చెప్పినట్లు క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments