ప్రస్తుతం టీమిండియా విండీస్ పర్యటనలో ఉంది. విండీస్ తో జరగబోయే టెస్ట్, వన్డే, టీ20 సిరీస్ ల కోసం.. భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. విండీస్ తో వార్మప్ మ్యాచ్ లు సైతం ఆడుతోంది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో పాల్గొన్న టీమిండియా ఆటగాళ్లతో స్థానిక బార్బడోస్ యంగ్ ప్లేయర్స్ ముచ్చటించారు. టీమిండియా ప్లేయర్స్ నుంచి మెలకువలు నేర్చుకున్నారు. అయితే బార్బడోస్ ప్లేయర్స్ కు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ సర్ప్రైజ్ గిప్ట్స్ ఇచ్చాడు.
వెస్టిండీస్ తో జరగబోయే రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ ల కోసం భారత జట్టు అక్కడికి చేరుకుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ జూలై 12న ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది టీమిండియా. వరల్డ్ కప్ ముగింట సిరీస్ కావడంతో.. టీమిండియా ఎలాగైనా ఈ మూడు సిరీస్ లను గెలవాలని పట్టుదలతో ఉంది. దాంతో గ్రౌండ్ లో ప్రాక్టీస్ ను మెుదలు పెట్టారు టీమిండియా ఆటగాళ్లు.
ఈ క్రమంలోనే అక్కడి వచ్చిన బార్బడోస్ యంగ్ క్రికెటర్లు భారత ఆటగాళ్లైన సిరాజ్, ఇషాన్ కిషన్, అశ్విన్ నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక బార్బడోస్ యంగ్ ప్లేయర్స్ కు మహ్మద్ సిరాజ్ ఊహించని గిఫ్ట్స్ ఇచ్చాడు. ఒకరికి బ్యాట్ తో పాటుగా, మరోకరికి షూస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. దాంతో ఆ యంగ్ ప్లేయర్స్ ఎంతో సంతోష పడ్డారు. తన విలువైన సలహాలను, టెక్నిక్స్ కూడా వారితో పంచుకున్నాడు ఈ హైదరాబాదీ పేసర్. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో యంగ్ ప్లేయర్స్ ను ప్రొత్సహిస్తున్న సిరాజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Kind gestures 👌
Autographs ✍️
Selfies 🤳
Dressing room meets 🤝#TeamIndia make it special for the local players and fans in Barbados 🤗 #WIvIND pic.twitter.com/TaWmeqrNS6— BCCI (@BCCI) July 7, 2023