SNP
Mohammed Siraj, Jasprit Bumrah, T20 World Cup 2024: తన సూపర్ బౌలింగ్‌తో టీమిండియాను గెలిపించిన బుమ్రాకు మరో స్టార్ బౌలర్ సిరాజ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Mohammed Siraj, Jasprit Bumrah, T20 World Cup 2024: తన సూపర్ బౌలింగ్‌తో టీమిండియాను గెలిపించిన బుమ్రాకు మరో స్టార్ బౌలర్ సిరాజ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
కోట్ల మంది క్రికెట్ అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. భారత జట్టు కరేబియన్ గడ్డపై విజయకేతనం ఎగురవేసింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. పొట్టి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది రోహిత్ సేన. బార్బోడోస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. రెండో సారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. మొట్టమొదటి సారి 2007లో భారత్ ఈ ప్రపంచ కప్‌ను సాధించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో సొంతం చేసుకుంది. అయితే.. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనే కాకుండా మొత్తం టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు జస్ప్రీత్ బుమ్రా. ఈ టోర్నీలో చాలా మ్యాచ్‌లు బౌలింగ్ బలంతోనే నెగ్గింది టీమిండియా. ఫైనల్‌లో కూడా ఆల్‌మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్‌ను తన సూపర్ బౌలింగ్‌తో మలుపుతిప్పాడు బుమ్రా.
అంత గొప్ప బౌలింగ్ వేసిన బుమ్రా.. మరో స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. సౌతాఫ్రికాపై ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత.. బుమ్రాను గౌరవిస్తూ.. ఒక ప్లకార్డును గిఫ్ట్‌గా ప్రదర్శించాడు. ‘లఈ భూమి మీద, గాల్లో, నీటి మీద బుమ్రానే బెస్ట్ బౌలర్’ అంటూ పేర్కొన్నాడు. ఈ ప్లకార్డ్ చూసి బుమ్రా కూడా సర్‌ప్రైజ్ అయ్యాడు. మ్యాచ్ చేజారుతున్న సమయంలో ఈ మ్యాచ్‌ను ఎవరైనా గెలిపించగలరా అని అనుకుంటే.. ఒక్క బుమ్రానే అని పనిచేయగలడని తాను నమ్మానని, అతనే చేసి చూపించాడంటూ.. మ్యాచ్ ముగిసిన తర్వాత కామెంటేటర్ దినేష్ కార్తీక్‌తో సిరాజ్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ సమయంలో సిరాజ్ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు.
ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా విజయానికి చివరి 5 ఓవర్లలో కేవలం 30 పరుగులు అవసరమైన సమయంలో బుమ్రా బౌలింగ్‌కి వచ్చి మ్యాచ్‌నే మలుపుతిప్పాడు. 30 బంతుల్లో 30 పరుగులు.. ఈక్వేషన్ ఉన్న టైమ్‌లో 16వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 4 పరుగులు ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా సౌతాఫ్రికా బ్యాటర్లలో టెన్షన్ మొదలైంది. అసలే ఒత్తిడిని తట్టుకోలేని సౌతాఫ్రికా.. బుమ్రా చేసిన కట్టడికి పాండ్యా వేసిన తర్వాత ఓవర్‌లో క్లాసెన్ వికెట్ కోల్పోయింది. మళ్లీ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 2 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత అర్షదీప్ సింగ్ 4 రన్స్, చివరి ఓవర్ పాండ్యా 8 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించారు. ఇలా ఫైనల్ మ్యాచ్ టీమిండియా గెలిచిందంటే అందుకు బుమ్రానే ప్రధాన కారణం. అందుకే సిరాజ్ బుమ్రాను అంతలా గౌరవించి, తన అభిమానం చాటుకున్నాడు. మరి బుమ్రా కోసం సిరాజ్ ప్రదర్శించిన ప్లకార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Siraj handing over the “Best bowler on land , air & water” placard to Bumrah 😂❤️ pic.twitter.com/qEN35fcYBx
— 🦉 (@Flicks_it) June 30, 2024