iDreamPost
android-app
ios-app

6 వికెట్లతో సిరాజ్‌ చేసిన అవమానానికి.. 6 ఓవర్లలో బదులు తీర్చుకున్న శ్రీలంక!

  • Published Aug 07, 2024 | 5:10 PM Updated Updated Aug 07, 2024 | 5:10 PM

Mohammed Siraj, IND vs SL, Avishka Fernando: మూడో వన్డేలో సిరాజ్‌పై లంకేయులు పగ తీర్చుకుంటున్నారు. ఏడాది క్రితం సిరాజ్‌ చేసిన అవమానికి ఇప్పుడు బదులుతీర్చుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Mohammed Siraj, IND vs SL, Avishka Fernando: మూడో వన్డేలో సిరాజ్‌పై లంకేయులు పగ తీర్చుకుంటున్నారు. ఏడాది క్రితం సిరాజ్‌ చేసిన అవమానికి ఇప్పుడు బదులుతీర్చుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 07, 2024 | 5:10 PMUpdated Aug 07, 2024 | 5:10 PM
6 వికెట్లతో సిరాజ్‌ చేసిన అవమానానికి.. 6 ఓవర్లలో బదులు తీర్చుకున్న శ్రీలంక!

సిరాజ్‌పై శ్రీలంక పగ తీర్చుకోవడం ఏంటి? సిరాజ్‌తో శ్రీలంకకు ఉన్న శత్రుత్వం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? సిరాజ్‌ అంటే శ్రీలంకకు పీకలదాక కోపం ఉంది. ఎందుకంటే.. అతను కొట్టిన దెబ్బ అలాంటిది. సిరాజ్‌ చేసిన అవమానం.. లంకను ప్రపంచ క్రికెట్‌ ముందు నవ్వులపాలు చేసింది. శ్రీలంక పేరు ఎత్తితే చాలు.. సోషల్‌ మీడియాలో సిరాజ్‌కు భయపడే జట్టుగా కామెంట్‌ చేసేవారు క్రికెట్‌ అభిమానులు కానీ, తాజాగా సిరాజ్‌పై శ్రీలంక జట్టు ప్రతీకారం తీర్చుకుంది శ్రీలంక.

కొన్ని రోజుల క్రితం శ్రీలంకతో సిరీస్‌ అనగానే అంతా సిరాజ్‌.. సిరాజ్‌.. అంటూ సిరాజ్‌ జపం చేశారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సిరాజ్‌ను ఎందుకు సెలెక్ట్‌ చేశారంటే.. శ్రీలంక కోటాలో అంటూ సరదాగా కామెంట్‌ చేశారు. అలా ఎందుకన్నారంటే.. శ్రీలంకపై సిరాజ్‌కు మెరుగైన రికార్డ్‌ ఉంది. 2023లో జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంకపై సిరాజ్‌ అద్బుతమైన ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా ఆసియా కప్‌ ఫైనల్‌లో అయితే.. శ్రీలంకను కేవలం 50 పరుగులకే కుప్పకూల్చాడు సిరాజ్‌ ఆ మ్యాచ్‌లో సిరాజ్‌ 7 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.

ఆ రోజు సిరాజ్‌ చేసిన అవమానికి.. తాజాగా కొలంబో వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక బదులు తీర్చుకుంది. సిరాజ్‌ బౌలింగ్‌ను లంక టాపార్డర్‌ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. అతను వేసిన 6 ఓవర్లలో ఏకంగా 58 పరుగులు చేసి.. దుమ్మరేపారు. ముఖ్యంగా అవిష్క ఫెర్నాండో అయితే.. సిరాజ్‌ బౌలింగ్‌లో సిక్సులతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌ ఆరంభమైనప్పటి నుంచి సిరాజ్‌ను టార్గెట్‌గా చేసుకొని మరీ శ్రీలంక బ్యాటర్లు పరుగులు చేశారు. ఆసియా కప్‌లో సిరాజ్‌ చేసిన అవమానికి ఈ మ్యాచ్‌తో కాస్త బదులుతీర్చుకున్నారంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.