Nidhan
IND vs BAN, Akash Deep, Mohammed Siraj: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు డే1 ముగిసింది. మొదటి సెషన్లో రోహిత్ సేనను భయపెట్టిన ప్రత్యర్థి జట్టు.. ఆ తర్వాత అశ్విన్-జడేజా దెబ్బకు వణికిపోయింది.
IND vs BAN, Akash Deep, Mohammed Siraj: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు డే1 ముగిసింది. మొదటి సెషన్లో రోహిత్ సేనను భయపెట్టిన ప్రత్యర్థి జట్టు.. ఆ తర్వాత అశ్విన్-జడేజా దెబ్బకు వణికిపోయింది.
Nidhan
క్రికెట్లో గ్రౌండ్లో ఏం జరుగుతోందనేది ఎంత ఇంపార్టెంటో.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోందనేది కూడా అంతే ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ను బట్టి ఆ టీమ్ ఎలా ఉంది? ప్లేయర్ల మధ్య ఉన్న కో-ఆర్డినేషన్, కెప్టెన్‌కు ఎంత గౌరవం ఇస్తారు, కోచింగ్ సిబ్బంది మాట వింటారా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడూ ఫన్నీగా, చిల్‌గా ఉంటే ఆ జట్టు ఆటగాళ్లు కలసికట్టుగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌ను ఇవాళ చూస్తే అలాగే అనిపించింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో తలపడుతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ టైమ్‌లో మన డ్రెస్సింగ్ రూమ్ వైపు కెమెరా కళ్లు బాగానే ఫోకస్ చేశాయి. అక్కడ అంతా బాగానే ఉన్నా.. పేసర్లు మహ్మద్ సిరాజ్-ఆకాశ్‌దీప్ మధ్య ఏదో జరుగుతున్నట్లు అనిపించింది. దీంతో అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు అభిమానులు.
చెన్నై టెస్ట్‌లో భారత డ్రెస్సింగ్ రూమ్ మొదట్లో కాస్త ఆందోళనగా కనిపించింది. టాపార్డర్ సహా మిడిలార్డర్ బ్యాటర్లు కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో కెప్టెన్ రోహిత్, కోచ్ గౌతం గంభీర్ సహా ప్లేయర్లంతా టెన్షన్ పడ్డారు. కనీసం 200 మార్క్ అయినా దాటుతామా అని ఆలోచనల్లో పడ్డారు. అయితే రవీంద్ర జడేజా-రవిచంద్రన్ అశ్విన్ చెలరేగి ఆడటంతో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లసాగింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం మారిపోయింది. ఆటగాళ్లంతా రిలాక్స్డ్గా, చిల్‌గా కనిపించారు. ఈ టైమ్‌లోనే సిరాజ్ చెవిలో నయా పేసర్ ఆకాశ్‌దీప్ ఏదో సీక్రెట్ చెబుతూ కనిపించాడు. సరిగ్గా ఆ సమయంలోనే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ గదిలో నుంచి బయటకు రావడాన్ని ఆ ఫొటోల్లో గమనించొచ్చు.
బ్యాటింగ్ లేదా బౌలింగ్.. దేనికి సంబంధించిన సీక్రెట్‌ను సిరాజ్‌తో ఆకాశ్‌దీప్ షేర్ చేశాడో తెలియదు. కానీ ఎవరికీ వినిపించకుండా చాలా సైలెంట్‌గా అతడితో మాట్లాడుతూ కనిపించాడు. అప్పుడే బయటకు వచ్చిన కోహ్లీ అదేదీ పట్టనట్టుగా వేరే చోటకు వెళ్లిపోయాడు. ఒకే చోట కూర్చున్న సిరాజ్-ఆకాశ్‌దీప్ మాత్రం దేని గురించో డిస్కస్ చేస్తూ కనిపించారు. ఆ సీక్రెట్ ఏంటనేది స్వయంగా వాళ్లు బయటపెడితే తప్ప తెలియదు. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఒకదశలో 144 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (112 బంతుల్లో 102 నాటౌట్) సూపర్బ్ ఇన్నింగ్స్‌లతో మెరిశారు. ఇద్దరూ కలసి ఏడో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. అశ్విన్ ఆల్రెడీ సెంచరీ బాదేశాడు. జడ్డూ మూడంకెల మార్క్‌కు దగ్గర్లో ఉన్నాడు. వీళ్లిద్దరూ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే భారత్‌కు అంత మంచిది. మరి.. సిరాజ్-ఆకాశ్‌దీప్ ఏ సీక్రెట్‌ను పంచుకున్నారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Akash Deep having a chat with Mohammad Siraj. pic.twitter.com/YjUxMfviAF
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2024