iDreamPost
android-app
ios-app

Mohammad Kaif: అన్నకు తగ్గ తమ్ముడు! ఆంధ్రా జట్టుపై చెలరేగిన షమీ సోదరుడు

  • Published Jan 08, 2024 | 10:02 PM Updated Updated Jan 08, 2024 | 10:02 PM

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ సోదరుడు మొహమ్మద్‌ కైఫ్‌.. తన తొలి రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కైఫ్‌ తన ప్రదర్శనతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు.

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ సోదరుడు మొహమ్మద్‌ కైఫ్‌.. తన తొలి రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కైఫ్‌ తన ప్రదర్శనతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు.

  • Published Jan 08, 2024 | 10:02 PMUpdated Jan 08, 2024 | 10:02 PM
Mohammad Kaif: అన్నకు తగ్గ తమ్ముడు! ఆంధ్రా జట్టుపై చెలరేగిన షమీ సోదరుడు

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ ఎంత పెద్ద బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాకపోయినా.. ఏకంగా 24 వికెట్లతో టోర్నీలోనే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అలాంటి గొప్ప బౌలర్‌ సోదరుడు కూడా క్రికెట్‌నే కెరీర్‌గా మల్చుకున్నాడన్న విషయం తెలిసిందే. షమీ తమ్ముడు మొహమ్మద్‌ కైఫ్‌ సైతం స్పీడ్‌ బౌలరే. తాజాగా ఈ కుర్రాడు దేశవాళీ టోర్నీ రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌తో బెంగాల్‌ జట్టు తరఫున తన తొలి రంజీ మ్యాచ్‌ ఆడాడు. రంజీ సీజన్‌ 2024లో ఆడుతున్న కైఫ్‌.. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే తనకు బౌలింగ్‌ వేసే అవకాశం వచ్చినా.. ఆ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తన అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంత్‌తో తన అన్న షమీలానే బ్యాటర్లను ముమ్ముతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల భారీ స్కోర్‌ చేసింది బెంగాల్‌. ఇక బెంగాల్‌ ఇన్నింగ్స్‌ తర్వాత ఆంధ్రా బ్యాటింగ్‌ దిగి బాగా బ్యాటింగ్‌ చేసింది. కానీ, షమీ తమ్ముడు.. కైఫ్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మొత్తం 32 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. కైఫ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చూసి.. అంతా అన్నకు తగ్గ తమ్ముడని కితాబిస్తున్నారు.

ఇ​క మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేసింది. బదులుగా ఆంధ్రా జట్టు సైతం గట్టి జవాబు చెప్పింది. ఆంధ్రా సైతం తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇక చివరి రోజు 82 పరుగులు చేసి బెంగాల్‌ మ్యాచ్‌ను ముగించింది. దీంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే.. షమీ సోదరుడు కైఫ్‌కు ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే.. అతనికి మరిన్ని వికెట్లు దక్కి ఉండేవి. ఏది ఏమైనా తొలి మ్యాచ్‌లోనే కైఫ్‌ ఆకట్టుకున్నాడు. మరి కైఫ్‌ తొలి రంజీ మ్యాచ్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.