iDreamPost
android-app
ios-app

క్రికెట్ లోకి షమీ తమ్ముడు ఎంట్రీ! ఏ టీమ్ తరఫున ఆడుతున్నాడంటే?

  • Published Dec 30, 2023 | 10:45 AM Updated Updated Dec 30, 2023 | 10:45 AM

Mohammed Shami Brother: మహ్మద్ షమీ ఫ్యామిలీ నుంచి మరోకరు క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమైయ్యాడు.

Mohammed Shami Brother: మహ్మద్ షమీ ఫ్యామిలీ నుంచి మరోకరు క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమైయ్యాడు.

  • Published Dec 30, 2023 | 10:45 AMUpdated Dec 30, 2023 | 10:45 AM
క్రికెట్ లోకి షమీ తమ్ముడు ఎంట్రీ! ఏ టీమ్ తరఫున ఆడుతున్నాడంటే?

మహ్మద్ షమీ.. టీమిండియా స్టార్ పేసర్ గా జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. ఇక తాజాగా జరిగిన వరల్డ్ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు కూడా. అయితే ప్రస్తుతం గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు షమీ. అతడు జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. షమీ ఫ్యామిలీ నుంచి మరోకరు క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అవును మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమైయ్యాడు. మరి అతడు ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్టార్ బౌలర్, వరల్డ్ కప్ 2023 హీరో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ దేశవాళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్ కోసం బెంగాల్ టీమ్ తొలి రెండు మ్యాచ్ ల కోసం తమ జట్టును ప్రకటించింది. ఇందులో షమీ సోదరుడు కైఫ్ చోటు దక్కించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్ లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా బౌలింగ్ లో రాణిస్తూ.. విజయ్ హజరే ట్రోర్నీలో 7 మ్యాచ్ ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. కాగా.. 2021లో బెంగాల్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు మహ్మద్ కైఫ్. ఇక తొలి రెండు మ్యాచ్ లకు బెంగాల్ జట్టుకు ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరి మహ్మద్ షమీ సోదరుడు కూడా క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio